Viral News: స్కర్ట్‌లతో అబ్బాయిల ఫ్యాషన్ షో, మెట్రోలోనూ చక్కర్లు - వైరల్ వీడియో
Men Wearing Skirts: ఇద్దరు యువకులు స్కర్ట్ వేసుకుని ఢిల్లీ మెట్రోలో చక్కర్లు కొట్టిన వీడియో వైరల్ అవుతోంది.

Men Wearing Skirts:
ఢిల్లీ మెట్రోలో..
కొన్నేళ్లుగా ఫ్యాషన్‌లో చాలా మార్పులొచ్చాయి. జీన్స్ టిషర్ట్ ట్రెండ్‌ని అమ్మాయిలు కూడా మొదలు పెట్టారు. వాటినే కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నారు. అబ్బాయిల ఫ్యాషన్‌ని అమ్మాయిలు కాపీ చేసినప్పుడు...అమ్మాయిల ఫ్యాషన్‌ని అబ్బాయిలు ఫాలో అయితే తప్పేముంది..? ఇదిగో ఇలాగే ఆలోచించారు ఇద్దరు యువకులు. వెంటనే స్కర్ట్‌లు వేసుకున్నారు. ఎవరి ఇంట్లో వాళ్లుంటే అది వార్త ఎందుకవుతుంది. అవే స్కర్ట్‌లు వేసుకుని బయటకు వచ్చారు. ఏకంగా మెట్రో ఎక్కి ట్రావెల్ చేశారు. ఒక్కసారిగా వైరల్ అయిపోయారు. ఢిల్లీ మెట్రోలో జరిగింది ఇదంతా. ఇద్దరు ఫ్రెండ్స్ టి షర్ట్స్, స్కర్ట్‌లు వేసుకుని మెట్రో ఎక్కారు. చాలా క్యాజువల్ ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో తిరుగుతూ కనిపించారు. ప్రయాణికులంతా వారిని ఆసక్తిగా చూశారు. చాలా మంది నవ్వుకున్నారు. సాధారణంగా ఇలాంటి వీడియోలు చేసినప్పుడు అందరూ తిట్టేస్తారు. కానీ...వీళ్లకు మాత్రం ప్రశంసల జల్లు కురిసింది. చాలా మంది నెటిజన్లు పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. సూపర్ స్టైలిష్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. అబ్బాయిలకు పెద్దగా ఫ్యాషన్ డ్రెస్‌లు రావడం లేదని కంప్లెయింట్ చేస్తున్న వాళ్లు..ఈ డ్రెసింగ్ ఫాలో అయిపోవచ్చు అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. స్టీరియోటైప్ ఆలోచనల్ని బద్దలు కొట్టేశారంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. కొత్త ఫ్యాషన్ ఫాలో అయ్యే హక్కు అబ్బాయిలకూ ఉంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు..లుంగీ ఓకే కానీ మరీ స్కర్ట్‌లు ఏంటి భయ్యా అని తిడుతున్నారు.
View this post on Instagram
ఢిల్లీ మెట్రో వైరల్ వీడియోలతోనే బాగా పాపులర్ అయిపోయింది. ఎవరో ఒకరు మెట్రోలో వింతగా ప్రవర్తించడం దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం..అది వైరల్ అవడం. ఇదంతా చాలా రోజులుగా జరుగుతున్నదే. ఇప్పుడు మరో వీడియో వైరల్ అవుతోంది. ఓ యువకుడు మెట్రో ఎక్కాడు. ఉన్నట్టుండి జేబులో నుంచి బ్రష్ తీసి అక్కడే తోముకోవడం మొదలు పెట్టాడు. ఇది చూసి చుట్టూ ఉన్న వాళ్లంతా షాక్ అయ్యారు. "వీడేంటి ఇలా చేస్తున్నాడు" అన్నట్టుగా వింతగా చూశారు. ఓ అమ్మాయైతే ఫోన్ మాట్లాడటం ఆపేసి మరీ ఆ యువకుడిని అలాగే చూస్తూ కూర్చుంది. ఫస్ట్ షాక్ అయిన ఆ యువతి..తరవాత నవ్వుకుంది. ఆ యువకుడు అలా బ్రష్ చేసుకుంటూ ఒక్కచోటే ఆగిపోలేదు. మెట్రోలని బోగీలన్నీ చుట్టొచ్చాడు. అలా బ్రష్ చేసుకుంటూనే నడుచుకుంటూ దర్జాగా నడుచుకుంటూ వెళ్లాడు. ప్రతి బోగిలోనూ అందరూ అతడిని చూసి ఆశ్చర్యపోయారు.
View this post on Instagram
Also Read: కాంగ్రెస్ ఓ ఔట్ డేటెడ్ ఇంజిన్, అవినీతిలో రికార్డులు సాధించిన పార్టీ అది - ప్రధాని మోదీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

