అన్వేషించండి

Viral News: కస్టమర్స్ ఎక్కువగా వస్తున్నారని మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌ని తగలబెట్టిన ఉద్యోగి

McDonalds: జార్జియాలో మెక్‌డొనాల్డ్స్ ఉద్యోగి ఊహించని పని చేశాడు. కస్టమర్స్ ఎక్కువగా వస్తున్నారన్న కోపంతో స్టోర్‌ని తగలబెట్టాడు. ఈ కేసులో కోర్టు ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది.

Worker Sets McDonalds Restaurant On Fire: కస్టమర్‌తో ఎక్కువ వస్తున్నారన్న కోపంతో మెక్‌డొనాల్డ్స్ ఉద్యోగి స్టోర్‌ని తగలబెట్టేశాడు. గతేడాది ఏప్రిల్‌లో జార్జియాలో ఈ ఘటన జరిగింది. నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఎక్కువ పని చేయాల్సి వస్తోందన్న అసహనంతో ఈ పని చేశాడు. యూఎస్ అటార్నీ ఆఫీస్ వెల్లడించిన వివరాల ప్రకారం స్టోర్ నుంచి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ దారిన వచ్చిన వాళ్లంతా భయపడిపోయారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పడానికి చాలా సమయం పట్టింది. స్టోర్‌ని తగలబెట్టిన తరవాత అదంతా వీడియో తీశాడు నిందితుడు. వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దాదాపు ఏడాది కాలంగా ఈ విచారణ కొనసాగుతోంది. దీనిపై యూఎస్ అటార్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఆస్తిని ధ్వంసం చేయడంతో పాటు ఆ స్టోర్ కొద్ది రోజుల పాటు మూసేయడానికి కారణమవడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇది కచ్చితంగా తీవ్రమైన నేరమే అని తేల్చిచెప్పారు. వ్యక్తిగత కక్షతో చుట్టూ ఉన్న వాళ్లని ప్రమాదంలో నెట్టినందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇలాంటి నేరాలు చేసే వాళ్లను ఊరికే వదిలేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. 

ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు స్థానికుల సాయం కూడా తీసుకున్నారు. స్టోర్‌ని తగలబెట్టిన సమయంలో లోపల చాలా మంది ఉన్నారు. మంటల్ని గుర్తించి వాళ్లు సరైన సమయానికి బయటకు రావడం వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగారు. కార్డ్‌బోర్డ్‌ని విరగ్గొట్టి ఆ ముక్కకు మంట అంటించి స్టోర్‌లో పడేశాడు. మంటలు అంటుకునేంత వరకూ అక్కడే ఉన్నాడు నిందితుడు. సీసీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయింది. తీవ్ర నేరంగా పరిగణించిన కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందో అంత మొత్తం చెల్లించాలని ఆదేశించింది. అయితే..ఎంత మొత్తం కట్టాలన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. స్థానికంగా ఈ ఘటన అలజడి సృష్టించింది. 

Also Read: Viral News: తాజ్‌మహల్‌లో షాజహాన్ సమాధి వద్ద గంగాజలంతో అభిషేకం, ఇద్దరు అరెస్ట్ - వీడియో

టాప్ హెడ్ లైన్స్

శబరిమల 2026: అయ్యప్ప భక్తులకు 5 కీలక మార్పులు! ₹2 లక్షల బీమా, దర్శన నిబంధనలు తెలుసుకోండి.
శబరిమల 2026: అయ్యప్ప భక్తులకు 5 కీలక మార్పులు! ₹2 లక్షల బీమా, దర్శన నిబంధనలు తెలుసుకోండి.
బద్రీనాథ్ నెయ్యి దుప్పటి, అఖండ జ్యోతి రహస్యం! 2027 యాత్ర తేదీలు ఇవే!
బద్రీనాథ్ నెయ్యి దుప్పటి, అఖండ జ్యోతి రహస్యం! 2027 యాత్ర తేదీలు ఇవే!
పదేళ్ల వయసులోనే 19 ప్రపంచ రికార్డులు.. 2 రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న కొంకటి ఇతిక్ష
పదేళ్ల వయసులోనే 19 ప్రపంచ రికార్డులు.. 2 రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న కొంకటి ఇతిక్ష
Virat Kohli Form:  కివీస్ టూర్లో వరుసగా విఫ‌ల‌మైనా టీమిండియా టాప్ స్కోరర్ కోహ్లీనే.. విరాట్ తాజా ఫామ్ పై ఆందోళన, వరల్డ్ కప్ సెలక్షన్ పై కొత్త చర్చ
కివీస్ టూర్లో వరుసగా విఫ‌ల‌మైనా టీమిండియా టాప్ స్కోరర్ కోహ్లీనే.. విరాట్ తాజా ఫామ్ పై ఆందోళన, వరల్డ్ కప్ సెలక్షన్ పై కొత్త చర్చ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Akvan Cyclone: ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
DNK Collections : మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
Bhimavaram Municipal Elections: భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
India Myanmar Naval Exercise: విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
Embed widget