అన్వేషించండి

Meta Digital Avatar: మనకు నచ్చిన దుస్తులతో డిజిటల్ అవతార్, కొత్త ఫీచర్‌ని తీసుకొస్తున్న మెటా సంస్థ

ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌ ఆసక్తికర ప్రకటన చేశారు. త్వరలోనే "మెటా అవతార్ స్టోర్స్‌"ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.

త్వరలోనే మెటా అవతార్ స్టోర్స్‌-జుకర్ బర్గ్ ప్రకటన 

ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌ ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. మెటా సంస్థ త్వరలోనే "మెటా అవతార్ స్టోర్స్‌"ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. అంటే మనరూపంలో ఉన్న ఓ మెటావర్స్ అవతార్‌ను క్రియేట్ చేసుకుని మనకు ఏ ఫ్యాషన్ నప్పుతుందో చూసుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఈ మెటా అవతార్ స్టోర్స్ డిజిటల్ డిజైనర్‌గా వర్క్ అవుతుందన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్యాషన్‌ పార్టనర్‌షిప్స్ వైస్‌ ప్రెసిడెంట్ ఎవా చెన్‌తో ఇన్‌స్టా లైవ్‌లో ఉన్న సమయంలో ఈ విషయం ప్రస్తావించారు జుకర్‌బర్గ్. ఫ్యాషన్ విషయంలో యువత ఏం కోరుకుంటోందో అదే వాళ్లకు చేరువ చేయాలని, ఈ మెటా అవతార్ స్టోర్స్‌ ద్వారా వాళ్లకు నచ్చిన ఔట్‌ఫిట్‌లను సెలెక్ట్ చేసుకునే అవకాశముంటుందని చెప్పారు. 

ఈ దేశాల్లో మాత్రమే మొదటగా..

మెటావర్స్‌లో మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవచ్చని అంటున్నారు జుకర్ బర్గ్. క్రియేటివ్ ఎకానమీని పెంచుకునేందుకు ఇలాంటి ఆలోచనలు ఎంతో ఉపకరిస్తాయంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ వర్చువల్ స్టోర్ వచ్చే వారం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, మెసెంజర్‌లో అందుబాటులోకి రానుంది. అయితే ప్రస్తుతానికి అమెరికా, కెనడా, మెక్సికో, థాయ్‌లాండ్‌లోనే ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్టు ప్రకటించారు జుకర్ బర్గ్. బాలెన్సిగా, ప్రాడా, థామ్ బ్రోన్ లాంటి బ్రాండ్స్‌ దుస్తుల్ని వర్చువల్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అవి వేసుకుంటే మనం ఎలా కనిపిస్తామో, ముందుగానే ఈ స్టోర్‌లో మన అవతార్‌కు సెట్ చేసి చెక్ చేసుకోవచ్చు. భవిష్యత్‌లో మరికొన్ని బ్రాండ్స్‌ని ఈ స్టోర్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని జుకర్  బర్గ్ స్పష్టం చేశారు. ఈ అవతార్‌ స్టోర్‌లో తాను ఎలా కనిపిస్తున్నాడో  చెప్పేందుకు కొన్ని లుక్స్‌నీ విడుదల చేశాడు. 

బ్రాండెడ్ దుస్తులతో పాటు ఉచిత దుస్తులు

వోగ్ బిజినెస్ రిపోర్ట్ ప్రకారం...ఈ అవతార్‌ స్టోర్‌లోని దుస్తులు 2.99 నుంచి 8.99డాలర్ల రేంజ్‌లో ఉంటాయి. ఈ స్టోర్ ద్వారా తమ బ్రాండ్స్‌ని మరింత సులువుగా ప్రమోట్ చేసుకునేందుకు వీలవుతుందని అంటున్నారు ఆయా బ్రాండ్స్ ఓనర్స్. ఫ్యాషన్ ప్రపంచంలో ఇదో కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని చెబుతున్నారు. ఈ బ్రాండెడ్ దుస్తులతో పాటు ఉచితంగా మరికొన్ని దుస్తులు అందుబాటులో ఉంచుతారు. భవిష్యత్‌లో ఈ వేదిక ద్వారానే దుస్తుల క్రయవిక్రయాలు జరిగేలా చూస్తామని వెల్లడించారు జుకర్ బర్గ్. ఎన్నో రోజులుగా మెటా ఈ పనిలోనే ఉంది. డిజిటల్ అవతార్‌ను క్రియేట్ చేసి యూజర్స్‌కి కొత్త అనుభవం ఇచ్చేందుకు జుకర్ బర్గ్ బాగానే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఏడాదే 3D అవతార్స్‌ని పరిచయం చేశారు. రకరకాల ఎక్స్‌ప్రెషన్లు, స్కిన్‌టోన్లతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. యూజర్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావటం వల్ల మెటావర్స్‌ ప్రపంచాన్ని విస్తృతం చేస్తున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Telangana News: తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
Blinkit Ambulance: వస్తువులే కాదు, అంబులెన్స్ కూడా 10 నిమిషాల్లో మీ ఇంటి ముందుకు వస్తుంది - బ్లింకిట్‌ కొత్త ఫీచర్‌
వస్తువులే కాదు, అంబులెన్స్ కూడా 10 నిమిషాల్లో మీ ఇంటి ముందుకు వస్తుంది - బ్లింకిట్‌ కొత్త ఫీచర్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP DesamJC Prabhakar reddy Fires on BJP | బస్సు తగులబెట్టినవాళ్లపై బూతులతో విరుచుకుపడిన జేసీ | ABP DesamBhima Koregaon History Vijay Diwas | ఎస్సీ వర్గీకరణ గురించి రేంజర్ల రాజేష్ ఏమన్నారంటే!Private School Bus Accident CCTV Video | ఓ బాలుడు మృతి, 13 మంది పిల్లలకు గాయాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Telangana News: తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
Blinkit Ambulance: వస్తువులే కాదు, అంబులెన్స్ కూడా 10 నిమిషాల్లో మీ ఇంటి ముందుకు వస్తుంది - బ్లింకిట్‌ కొత్త ఫీచర్‌
వస్తువులే కాదు, అంబులెన్స్ కూడా 10 నిమిషాల్లో మీ ఇంటి ముందుకు వస్తుంది - బ్లింకిట్‌ కొత్త ఫీచర్‌
Woman Life Rs. 5 Lakh: మహిళ ప్రాణం ఖరీదు 5 లక్షల రూపాయలు, ప్రాణాలకు విలువ కట్టిన ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం
మహిళ ప్రాణం ఖరీదు 5 లక్షల రూపాయలు, ప్రాణాలకు విలువ కట్టిన ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం
Aus Vs Ind 5th Test Live Updates: అదే కథ.. అదే వ్యథ.. మళ్లీ విఫలమైన భారత బ్యాటర్లు.. ఆదుకున్న జడేజా, పంత్
అదే కథ.. అదే వ్యథ.. మళ్లీ విఫలమైన భారత బ్యాటర్లు.. ఆదుకున్న జడేజా, పంత్
Game Changer: గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
 గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
Vizag Railway Zone : విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ కు ఇంకా దక్కని ఆమోదం - మోదీ పర్యటన ఖరారు
విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ కు ఇంకా దక్కని ఆమోదం - మోదీ పర్యటన ఖరారు
Embed widget