By: Ram Manohar | Updated at : 22 Apr 2023 12:45 PM (IST)
మన్‌కీ బాత్ 100 వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని మోదీ రూ.100 కాయిన్ విడుదల చేయనున్నారు.
Mann Ki Baat 100th Episode:
రూ. 100 కాయిన్ విడుదల
మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని మోదీ దేశానికి ఓ గిఫ్ట్ ఇవ్వనున్నారు. రేపు (ఏప్రిల్ 30) మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ సమయంలోనే ప్రధాని రూ.100 కాయిన్ విడుదల చేయనున్నారు. ఈ కాయిన్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దీనిపై మైక్రోఫోన్ సింబల్ ఉంటుంది. దీంతో పాటు 2023 అని ప్రింట్ చేసి ఉంటుంది. ఈ మేరకు అధికారికంగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం ఒక్క కాయిన్‌ని మాత్రమే ప్రింట్ చేయనున్నారు. ఈ కాయిన్ సైజ్ 44 MM. వెండి, రాగి, నికెల్, జింక్‌తో దీన్ని తయారు చేశారు. కాయిన్ ముందు అశోక స్తంభం కనిపించనుంది. దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. ఓ వైపు India అని ప్రింట్ చేయనున్నారు. రూపీ సింబల్ కూడా ఉంటుంది. మైక్రోఫోన్ సింబల్‌తో పాటు సౌండ్ వేవ్స్ సింబల్ కూడా ప్రింట్ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 'Mann Ki Baat 100' అని ప్రింట్ చేయనున్నారు. ఈ కాయిన్ బరువు 35 గ్రాములు.
గతంలోనూ
ఇప్పుడే కాదు. రూ.100 కాయిన్‌లు గతంలోనూ చాలా సందర్భాల్లో ప్రింట్ చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ స్మారకార్థం గతంలో ప్రధాని నరేంద్ర మోదీ 100 రూపాయల కాయిన్ విడుదల చేశారు. రాజ్‌మాత విజయ్‌రాజ్ సిందియా శత జయంతి సందర్భంగా కూడా రూ.100 కాయిన్ విడుదల చేశారు. మహారాణ ప్రతాప్ 476వ జయంతి సందర్భంలోనూ ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఓ కాయిన్ ప్రింట్ చేసింది. 2010, 2011,2012, 2014, 2015లో ఇలాంటి కాయిన్స్ ప్రింట్ చేయించింది కేంద్రం. ఈ సారి 100వ ఎపిసోడ్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది కేంద్రం. దాదాపు లక్ష బూత్‌ల వద్ద ఈ కార్యక్రమాన్ని ఎయిర్ చేయనున్నారు. కొన్ని చోట్ల అధికారులు ఇంటింటికీ వెళ్లి ఈ కార్యక్రమంపై అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
Fixed Deposit: స్టేట్ బ్యాంక్ Vs పోస్టాఫీస్ - ఏది బెస్ట్ FD?
Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం
Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా ఏపీ వాళ్లు మృతి - వివరాలు తెలుసుకుంటున్నామని సీఎం ప్రకటన
Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?
Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!
Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ
Kamal Haasan: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్
Train Travel Insurance: మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకండి, 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా
Adipurush Movie: తెలుగులో ఆ తప్పులేంటి? 'ఆదిపురుష్' దర్శకుడిపై నెటిజెన్స్ సెటైర్లు