Viral Video: ఇ-బైక్ బ్యాటరీ పట్టుకుని లిఫ్ట్ ఎక్కిన వ్యక్తి, క్షణాల్లోనే పేలుడు - వీడియో
Viral News: చైనాలో ఓ వ్యక్తి ఇ-బైక్ బ్యాటరీ పట్టుకుని లిఫ్ట్ ఎక్కిన కాసేపటికే పేలిపోయింది. భారీగా మంటలు అంటుకుని ఒళ్లంతా కాలిపోయిన పాత వీడియో వైరల్ అవుతోంది.
E Bike Battery Explodes in Lift: విద్యుత్ వాహనాల్లో బ్యాటరీల పేలుడు ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. ఎండాకాలంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నప్పటికీ బ్యాటరీ పేలుడు సమస్యతో వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీని పట్టుకుని ఓ వ్యక్తి లిఫ్ట్ ఎక్కిన క్షణాల్లోనే బ్యాటరీ పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి తప్పించుకునేందుకూ ఆ వ్యక్తికి అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా ఒళ్లంతా మంటలు అంటుకున్నాయి. భారీ శబ్దం రావడం వల్ల ఆ ఫ్లోర్‌లో ఉన్న వాళ్లు ఉలిక్కిపడ్డారు. వెంటనే అక్కడి సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన లిఫ్ట్ వద్దకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు మంటల్ని ఆర్పేశారు. ఆ తరవాత లిఫ్ట్ డోర్ తెరిచారు. అప్పటికే బాధితుడి శరీరం పూర్తిగా కాలిపోయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. 2021లో జరిగిన ఈ ఘటన జరగ్గా ఈ వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. బాధితుడు బతికాడా లేదా అన్న వివరాలు తెలియలేదు. ఈ వీడియోతో e-bike బ్యాటరీల పేలుడుపై మరోసారి ఆందోళన మొదలైంది.
Caution Warning :
— Tech Star Shahrukh (@techstarsrk) July 25, 2024
“A person brings the e-bike battery into the lift. When the lift closes, the electro-charge of the battery turns the whole lift into a magnetic battery. “
Although above statement seems unlikely to be true, the battery may have damaged that’s why it happened.. pic.twitter.com/Czx3G9cYBv