Maharashtra Road Accident: భక్తులపైకి దూసుకెళ్లిన కారు- ఏడుగురు మృతి!
Maharashtra Road Accident: మహారాష్ట్ర సోలాపుర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
Maharashtra Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి భక్తుల పైకి దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు.
ఇదీ జరిగింది
సోలాపుర్ సంగోలా పట్టణానికి సమీపంలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వ.చ్చిన ఓ కారు అదుపు తప్పి భక్తులకుపై దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు.
Maharashtra | Seven dead, several injured in a road accident near Sangole town in Solapur district. pic.twitter.com/WnHvGFPBMt
— ANI (@ANI) October 31, 2022
32 మంది భక్తుల బృందం కార్తీక ఏకాదశి సందర్భంగా జాతర్‌వాడి నుంచి పంధర్‌పుర్‌కు కాలినడకన బయలుదేరారు. వీరంతా సంగోలా పట్టాణానికి చేరుకున్న తర్వాత భక్తులను ఎస్‌యూవీ వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును 75 సంవత్సరాల వ్యక్తి నడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
సీఎం విచారం
ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
Also Read: NASA's Sun Smiling PIc: సన్నీ ఫన్నీగా ఉండటం ఎప్పుడైనా చూశారా?