Madhya Pradesh: పెళ్లి భోజనం తిని వాంతులు, 100 మంది ఆసుపత్రి పాలు
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో పెళ్లి భోజనం చేసిన 100 మంది అస్వస్థతకు గురయ్యారు.
Madhya Pradesh:
మధ్యప్రదేశ్‌లో..
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో పెళ్లి భోజనం తిని 100 మంది అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి పూర్తికాగానే భోజనం చేసి అతిథులంతా వెళ్లిపోయారు. కాసేపటి తరవాత అందరికీ వాంతులు అయ్యాయి. తీవ్ర కడుపు నొప్పితో విలవిలలాడిపోయారు. సాయంత్రానికి అందరూ మంచం పట్టారు. దగ్గర్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 20 మంది చేరారని, వారికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. మరి కొంత మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. "ఓ ఆలయంలో జరిగిన పెళ్లికి అందరూ హాజరయ్యారు. అక్కడ వివాహ విందు చేసిన తరవాత అందరికీ వాంతులయ్యాయి. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదు" అని వైద్యులు తెలిపారు.
Over 100 fall ill in Madhya Pradesh after having food at wedding party
— ANI Digital (@ani_digital) December 3, 2022
Read @ANI Story | https://t.co/ncxcPgLfmY#MadhyaPradesh #Dhar #food pic.twitter.com/JVIPTzsqGV
నెల్లూరులోనూ..
ఇటీవలే ఏపీలోని నెల్లూరులోనూ ఇదే జరిగింది. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం పద్మాపురం గ్రామంలో పెళ్లి విందులో పుడ్ పాయిజన్ అయింది. పెళ్లి విందులో పాల్గొన్న దాదాపు 200 మంది పైగా అస్వస్థత గురి అయ్యారు. పెళ్లి విందులో పాల్గొన్న వారికి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు కావడంతో వారిని హుటాహుటిన ఎస్.ఆర్.పురం మండల ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. అస్వస్థతకు గురైన వారు ఆసుపత్రిలో చికిత్స కోసం బారులు తీరారు. స్థానికుల వివరాలు ప్రకారం పద్మాపురం గ్రామానికి చెందిన కుటుంబంలో పెళ్లి జరిగింది. మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో దాదాపు 500 మందికి పైగా భోజనాలు ఏర్పాటుచేశారు. వీరిలో ఆఖరులో తిన్నవారు అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు చెప్పారు. వాంతులు, విరేచనాలు విపరీతంగా కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
బిహార్‌లో..
ఇటీవలే బిహార్‌లోనూ ఓ దారుణం జరిగింది. బల్లి పడినట్లు అనుమానిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని బలవంతంగా తినిపించడంతో 200 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు. భాగల్పుర్‌లోని ఓ పాఠాశాలలో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు ట్యూషన్ క్లాసులకు వెళ్లగా అక్కడ ఒకరికి వాంతులయ్యాయి. కొద్దిసేపటికే మిగిలిన విద్యార్థులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పాఠశాల సమీపంలోని ఓ వైద్య కేంద్రానికి విద్యార్థులను తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. మధ్యాహ్న భోజనంలో బల్లి పడిందని అందుకే విద్యార్థులు అస్వస్థతగు గురయ్యారని కొంతమంది ఆరోపిస్తున్నారు. 8వ తరగతి విద్యార్థి ప్లేట్‌లో చనిపోయిన బల్లి
కనిపించడంతో ఈ విషయాన్ని విద్యార్థులు.. ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లారట. అయితే అది బల్లి కాదని వంకాయని విద్యార్థులకు ప్రిన్సిపాల్ చెప్పినట్లు సమాచారం. కొంతమంది విద్యార్థులు ఆహారం తినేందుకు ముందుకు రాకపోవడంతో పాఠశాల సిబ్బంది ఆహారం తినాలని వారిని బలవంతం చేసినట్లు సమాచారం. ఆ ఆహారం తిన్న తర్వాతే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్పిందే నిజమైతే పాఠశాల అధికారులు, సిబ్బందిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ తెలిపింది. పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది తప్పు చేసినట్లు తేలితే అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
Also Read: Gujarat Elections: ప్రచార సభలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఒవైసీ - వైరల్ వీడియో