Lok Sabha Security Breach: ఆ గ్యాస్ ప్రమాదకరమైంది కాదు, విచారణకు ఆదేశించాం - లోక్‌సభ ఘటనపై ఓం బిర్లా
Lok Sabha Security Breach: లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు.
Security Breach Lok Sabha:
సభలో అలజడి..
లోక్‌సభలో ఇద్దరు (Lok Sabha Security Breach Live) ఆగంతకులు దూసుకురావడం అలజడి సృష్టించింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ భద్రతా వైఫల్యంపై (Security Breach in Lok Sabha) పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు సూచించినట్టు తెలిపారు. ఈ ఘటన తరవాత సభ తిరిగి ప్రారంభమైంది. ఆ సమయంలోనే స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"జీరో అవర్‌లో జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించాం. ప్రస్తుతం ఆ విచారణ కొనసాగుతోంది. తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు సూచించాం. ఆ ఆగంతకులు సభలో వదిలిన గ్యాస్ ప్రమాదకరమైంది కాదని ప్రాథమిక విచారణలో తేలింది. దీని గురించి భయపడాల్సిన పని లేదు"
- ఓం బిర్లా, లోక్‌సభ స్పీకర్
#WATCH | Lok Sabha security breach | Lok Sabha speaker Om Birla says "A thorough investigation of the incident that took place during zero hour, is being done. Essential instructions have also been given to Delhi Police. In the primary investigation, it has been found that it was… pic.twitter.com/GPMPAoyeLk
— ANI (@ANI) December 13, 2023