అన్వేషించండి

Leech: జ‌ల‌గ మీద ఉప్పు వేస్తే చ‌నిపోతుంది! ఎందుకో తెలుసా?

ప‌ట్టుకుంటే వ‌ద‌ల‌కుండా ఇత‌రుల ర‌క్తం పీల్చే జ‌ల‌గను ఉప్పుతో చంపేయొచ్చ‌ని మీకు తెలుసా? అస‌లు ఉప్పు వ‌ల్ల జ‌ల‌గ‌లు ఎందుకు చ‌నిపోతాయి.. కార‌ణాలేంటో తెలుసుకుందామా?

ప‌ట్టుకుంటే వ‌ద‌ల‌కుండా ఇత‌రుల ర‌క్తం పీల్చే జ‌ల‌గను ఉప్పుతో చంపేయొచ్చ‌ని మీకు తెలుసా? అస‌లు ఉప్పు వ‌ల్ల జ‌ల‌గ‌లు ఎందుకు చ‌నిపోతాయి.. కార‌ణాలేంటో తెలుసుకుందామా?

మీరు జలగ పేరు వినే ఉంటారు. రక్తం పీల్చే ఈ జీవిని చాలా మంది చూసి ఉంటారు. జ‌ల‌గ‌లా ర‌క్తం పీల్చేస్తున్నాడ‌ని తెలుగులో ఓ సామెత‌. అలాంటి జ‌ల‌గ ఉప్పు వ‌ల్ల చ‌నిపోతుంది. జలగలు ఎక్కువగా తడి ప్రదేశాల్లో కనిపిస్తాయి. రక్తం పీల్చే పురుగుగా మనకు తెలిసిన జలగ మాంసాహార కీటకం. ఇది మనుషులతో పాటు అనేక జంతువుల రక్తాన్ని పీల్చుకోగలదు. జంతువులు లేదా మానవుల శరీరానికి అంటుకోవడం ద్వారా, అది వారి రక్తాన్ని పీలుస్తూనే ఉంటుంది. దాని క‌డుపు నిండాక వారిని వ‌దిలేస్తుంది. దీంతో ప్రజలు తరచుగా ఉప్పును జ‌ల‌గ‌ల‌ను తొల‌గించేందుకు ఉపయోగిస్తారు. ఇతరుల రక్తాన్ని పీల్చే ఈ పురుగు ఉప్పు వేయగానే చనిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

జలగ ప్రధాన ఆహారం రక్తం

లీచ్ లేదా జలగ శాస్త్రీయ నామం 'హిరుడో మెడిసినాలిస్' (హిరుడినియా). జ‌ల‌గ‌ల్లో సుమారు ఆరు వంద‌ల ర‌కాల జాతులు ఉన్నాయి. తేమతో కూడిన ప్రదేశాలలో మ‌నకి జ‌ల‌గ‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ఇది ఒక రకమైన హెమోఫేజిక్ వార్మ్, అంటే రక్తం దీని ప్రధాన ఆహారం. జలగ వ్యక్తి  శరీరానికి అంటుకొని వారి ర‌క్తాన్ని పీలుస్తుంది. జ‌ల‌గ వ్య‌క్తి చ‌ర్మానికి అంటుకున్న‌ప్పుడు ఉప్పును చ‌ల్లి జ‌ల‌గ‌ను చ‌ర్మం నుంచి వేరు చేయ‌వ‌చ్చు. అయితే జ‌ల‌గ నొప్పి లేకుండా కాటు వేస్తుంది. దీనివ‌ల్ల జ‌ల‌గ త‌మ‌ను అంటుకున్న విష‌యం వ్య‌క్తులు లేదా జంతువుల‌కు తెలియ‌దు.

ఉప్పు వల్ల ఎందుకు చనిపోతుంది?

జ‌ల‌గ ఉప్పు వ‌ల్ల చ‌నిపోవ‌డానికి కార‌ణం అందులోని ర‌సాయ‌న గుణాలు. జ‌ల‌గ చ‌ర్మం చాలా సున్నితంగా ఉంటుంది. జ‌ల‌గ‌లో నీటి శాతం ఎక్కువ‌గా ఉంటుంది. ఉప్పు నీటిని గ్రహిస్తుంది. ఈ నేప‌థ్యంలో జలగ చర్మం ప‌లుచ‌గా ఉండ‌డం వ‌ల్ల‌ ఓస్మోటిక్ ప్రెజర్ అంటే ఆస్మాసిస్ ఒత్తిడి కారణంగా, ఉప్పు జలగ శరీరంలోని మొత్తం నీటిని గ్రహిస్తుంది. శరీరంలో నీరు లేనప్పుడు, కణాలు పనిచేయడం ఆగిపోయి జ‌ల‌గ‌ ఊపిరాడక చ‌నిపోతుంది. 

వైద్య రంగంలో కీల‌కం

పురాతన ఈజిప్టు కాలం నుంచి నాడీ వ్యవస్థ, దంత సమస్యలు, చర్మ వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్ల చికిత్స‌లో జ‌ల‌గ‌ల‌ను వినియోగిస్తున్నారు. ఆధునిక వైద్య రంగంలోనూ జ‌ల‌గ‌ను కీల‌కంగా భావిస్తారు. జ‌ల‌గ‌లు ర‌క్తం గ‌డ్డ‌కుండా ప‌నిచేసే పెప్టైడ్స్, ప్రోటీన్ల‌ను స్ర‌విస్తాయి. ఈ స్రావాలు గాయానికి ర‌క్తం ప్ర‌వ‌హింప‌జేస్తాయి. దీంతో గాయం న‌య‌మ‌య్యేందుకు ఈ స్రావాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దీర్ఘకాలిక చర్మ వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో వీటిని ఉప‌యోగిస్తున్నారు. జలౌక పద్ధతిలో, అనేక వ్యాధులకు జలగ సాయంతో చికిత్స అందిస్తారు. జలగలు శరీరంలోని మురికి రక్తాన్ని పీల్చి, మృతకణాలను నాశనం చేస్తాయి. ఇది కాకుండా, శరీరంలోని ఏదైనా భాగంలో చర్మం దెబ్బతిన్నప్పుడు, రక్త ప్రవాహం ఆగిపోయినప్పుడు, మృతకణాలను సక్రియం చేయడానికి జలౌకా పద్ధతిలో జలగల సాయం తీసుకుంటారు. అయితే జ‌ల‌గ‌ల సాయంతో చేసే ఈ వైద్యంలోనూ కొన్ని దుష్ప్ర‌భావాలు ఉన్నాయ‌ని చెబుతారు.

టాప్ హెడ్ లైన్స్

Shooting Organization Outcry: పతకం లేకుండానే ఒలింపిక్ స్టార్ భాకర్.. గట్టర్ వాసన, రోజూ 5 గంటల బస్సు ప్రయాణంపై ఆమె తండ్రి ఆగ్రహం
పతకం లేకుండానే ఒలింపిక్ స్టార్ భాకర్.. గట్టర్ వాసన, రోజూ 5 గంటల బస్సు ప్రయాణంపై ఆమె తండ్రి ఆగ్రహం
Sunil Gavaskar Warning: ముగింపునకు అగార్కర్ శకం, కొత్త బాస్ రాక వేళ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు
ముగింపునకు అగార్కర్ శకం, కొత్త బాస్ రాక వేళ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Khairatabad Assembly Seat: దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ విడుదల
దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ విడుదల

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget