By: Ram Manohar | Updated at : 25 Mar 2023 11:52 AM (IST)
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసు విచారణలో భాగంగా బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్ సీబీఐ ఎదుట హాజరయ్యారు. (Image Credits: ANI)
Land-For-Jobs Scam Case:
సీబీఐ విచారణ..
బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్ ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ విచారణలో భాగంగా సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే ఆయనకు రెండు సార్లు సమన్లు జారీ చేసింది సీబీఐ. అయితే రెండు సార్లూ విచారణకు హాజరు కాలేదు తేజస్వీ. ఆయనతో పాటు లాలూ కూతురు RJD ఎంపీ మీసా భారతి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున తమ పేరిట భూములు రాయించుకున్నారని ఆరోపిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను కూడా విచారించారు. ఆయన కుటుంబ సభ్యులందరికీ ఈ స్కామ్‌లో భాగస్వామ్యం ఉందని సీబీఐ చెబుతోంది. లాలూ భార్య రబ్రీదేవిని కూడా అధికారులు విచారించారు. మార్చి 25న విచారణకు వస్తానని చెప్పిన తేజస్వీ యాదవ్..ఆ మేరకు హాజరయ్యారు. ఈ ఇన్వెస్టిగేషన్‌పై స్పందించిన తేజస్వీ యాదవ్...పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
"దర్యాప్తు సంస్థలకు మొదటి నుంచి సహకరిస్తూనే ఉన్నాం. కానీ ప్రస్తుతం దేశం రాజకీయాలు సంక్లిష్టంగా మారినట్టు కనిపిస్తోంది. తలొంచడం సులువే. కానీ పోరాడడం మాత్రం అంత సులువు కాదు"
- తేజస్వీ యాదవ్, బిహార్ డిప్యుటీ సీఎం
Delhi: Bihar Deputy CM Tejashwi Yadav reaches CBI office.
— ANI (@ANI) March 25, 2023
He will appear before CBI for questioning in connection with the land for job scam case. pic.twitter.com/RxjH09fXBx
#WATCH | Delhi: RJD MP Misa Bharti leaves for ED office.
— ANI (@ANI) March 25, 2023
Misa Bharti will appear before ED for questioning in connection with the land for job scam case. pic.twitter.com/A3INidOh3s
లాలూని రెండు గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో తీసింది ఈడీ. ఇప్పటికే సీబీఐ ఈ కేసుకు సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవితో పాటు మొత్తం 14 మంది పేర్లు చేర్చింది. లాలూ హయాంలో ఈ స్కామ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గ్రూప్ డి ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు చోట్ల స్థలాలను లంచంగా తీసుకున్నట్టు చెబుతోంది ఈడీ. 2004-09 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే ఈ స్కామ్ జరిగినట్టు ED అధికారులు ఆరోపిస్తున్నారు. ముంబయి, జబల్పూర్, కోల్కత్తా, జైపూర్, హాజిపూర్‌లలో పలువురికి గ్రూప్ D పోస్ట్‌లు ఇచ్చారని, అందుకు బదులుగా తమ పేరు మీద స్థలాలు రాయించు కున్నారని చెబుతున్నారు. AK Infosystems Private Limited పేరు మీద కూడా స్థలాలు రాయించారని ED వివరిస్తోంది. ఆ తరవాత ఈ కంపెనీ ఓనర్‌షిప్‌ను లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల పేరుపై మార్చారన్న ఆరోపణలున్నాయి.
Also Read: Rahul Gandhi Disqualification: వాయనాడ్‌లో బ్లాక్‌డే, రాహుల్‌పై అనర్హత వేటుని ఖండిస్తూ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం
NITAP: నిట్ అరుణాచల్ ప్రదేశ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, అర్హతలివే
Police Dance: గణేష్ నిమజ్జన ఊరేగింపులో అదిరే స్టెప్పులేసిన పోలీసులు, వీడియో వైరల్
ICMR: ఐసీఎంఆర్-ఎన్‌ఐఆర్‌టీలో 78 టెక్నికల్, ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలు
IITB PhD: ఐఐటీ భువనేశ్వర్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
UPSC Exam Calender: యూపీఎస్సీ-2024 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
/body>