Kolkata Models : అర్థనగ్నంగా దుర్గా మండపానికి కోల్‌కతా మోడల్స్ - ఎలా సమర్థించుకుంటున్నారంటే ?
Viral News : కోల్‌కతాలోని ఓ దుర్గా మాత మండపానికి ముగ్గురు మోడల్స్ వెళ్లారు. అర్థనగ్నంగా వెళ్లిన వారి తీరుపై విమర్శలు వస్తున్నాయి. కానీ వారు సమర్థించుకుంటున్నారు.
Kolkata Models Visit Durga Puja Pandal Wearing Bold Dress Creates Controversy : ముంబైలో ఓ దుర్గా మాత మండపంలోకి చెప్పులు వేసుకుని వచ్చారంటూ కొంత మందిపై సినీ నటి కాజోల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో కోల్ కతాలోని ఓ దుర్గా మండపంలోకి ముగ్గురు మోడల్స్ అర్థనగ్నంగా పూజల కోసం వెళ్లారు. అక్కడ కాస్త అతిగా ఫోటోలకు ఫోజులిచ్చారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసుకున్నారు. ఇక వివాదం కాకుండా ఉంటుందా ?
View this post on Instagram
ఫోటోలకు ఫోజలు ఇచ్చిన వారిలో హేమశ్రీ భద్ర, సన్నతి మిత్రా అనే ఇద్దరూ బెంగాల్‌లో ఫేమస్ మోడల్స్. వారిద్దరూ మిస్ కోల్ కతా విన్నర్స్ కూడా. తాము అలా దుర్గా మాత మండంలోకి వెళ్లడాన్ని వారు విప్లవాత్మక చర్యగా చెప్పుకున్నారు. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్టులు పెట్టుకున్నారు.
View this post on Instagram
వీరి ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారిపోయాయి. ఎక్కువ మంది నెగెటివ్ గా స్పందిస్తున్నారు. ఉమన్ ఎంపవర్ మెంట్ అంటే అది కాదని కొంత మంది గట్టిగా వాదిస్తున్నారు. ఈ పేరుత సనాతన ధర్మాన్ని కించ పరుస్తున్నారని మండిపడుతున్నారు. పాపులారిటీ కోసం దుర్గా మాత మండపాన్ని వాడుకున్నారని మరొంత మంది విమర్శలు గుప్పించారు. ఇలాంటి వైపరీత్యాన్ని వర్ణించాడనికి మాటలు రావడం లేదని మన సంస్కృతి అంతమవడానికి దగ్గరగా ఉందని కొంత మంది మథనపుతున్నారు.
View this post on Instagram
కోల్‌కతాలో దుర్గా పూజ ఉత్సవాలకు ప్రత్యేకత ఉంటుంది. కోల్ కతాలో వీధి వీధిని దుర్గామాత మండపాలు ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో కొంత మంది చేసే పనుల వల్ల వివాదాలు ఏర్పాడుతూంటాయి. సోషల్ మీడియాలో ఫెమినిస్టులు కూడా వీరిని సమర్థించడం లేదు.
Let me clear, this is not feminism...
— Anju Yadav (@anjuydv) October 10, 2024
Two women from this picture belongs to Glamour World.
-One is Hemoshree Bhadra who was "Miss Kolkata India 2016"
-Another is Sannati Mitra who was "Miss Kolkata India 2017"
And their content revolves around their body only.#Navrati2024 pic.twitter.com/CGQLB2wKD3