Delhi liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ వ్యాపారి పేరు - సీబీఐ ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ వ్యాపారి పేరు వెలుగులోకి వచ్చింది.
Delhi liquor Scam : ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీశ్ సిసోడియాతో పాటు 15 మందిని ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా సీబీఐ పేర్కొంది
హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై పేరు కూడా ఎ 14గా సీబీఐ ఎఫ్ఐఆర్‌లో ఉండటం కలకలం రేుపతోంది. లిక్కర్ స్కామ్‌లో ఏ1 గా సిసోడియా పేరు .. ఏ14 గా రాంచంద్ర పిళ్లై పేరును చేర్చారు. ఇండో స్పిరిట్ పేరుతో బెంగళూరు కేంద్రంగా లిక్కర్ రాంచంద్ర పిళ్లై లిక్కర్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా టెండర్ దక్కించుకోవడానికి అరుణ్ పాండ్యా ద్వారా మనీష్ సిసోడియాకు డబ్బులు ఇచ్చినట్లుగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. రూ. 2.50 కోట్లు సిసోడియాకు లంచంగా ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
హైదరాబాద్, బెంగళూరులోని రాంచంద్ర పిళ్లై ఆఫీస్‌ల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దేశవ్యాప్తంగా 31 చోట్ల సీబీఐ సోదాలు చేసింది. ఢిల్లీ, గుర్గాం, చండీఘడ్, ముంబై, హైదరాబాద్, లక్నో..బెంగళూరులో కొ 10 లిక్కర్ కంపెనీల్లో తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ కమిషన్ అర్వా గోపికృష్ణతోపాటు..డిప్యూటీ కమిషన్ ఆనంద్ తివారీ పంకజ్ భట్నాఘర్ ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. లిక్కర్ లైసెన్స్ జారీల్లో భారీ ఎత్తున అవకతవకలు..భార్యల పేర్లపై లిక్కర్ లైసెన్స్‌లు తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. లైసెన్స్‌లు పొందేందుకు భారీగా లంచాలు సమర్పించారని.. ల్1 లైసెన్స్‌ల కోసం అనుమతులు తీసుకోకుండానే జారీ చేశారని గుర్తించారు.
FLASH: CBI names Sisodia as No. 1 accused in FIR in alleged liquor policy scam
— The New Indian (@TheNewIndian_in) August 19, 2022
CM’s close aide Vijay Nair besides 14 private people across Lucknow, Defence Colony, Okhla & Kalkaji in Delhi, Gurgaon, Mumbai & Karnataka also named
List includes liquor firm Brindco & Indospirit pic.twitter.com/UrfKpM6EcQ
అంతకు ముందు ఈ స్కాంతో తెలంగాణకు సంబంధం ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. కొత్త పాలసీ రూపకల్పన అంతా తెలంగాణలోనే జరిగాయని పేర్కొన్నారు. ఈ డీల్ సెట్ చేయడానికి తెలంగాణకు చెందిన వాళ్లు బుక్ చేసిన హోటళ్లు, రెస్టారెంట్లకు మనీష్ సిసోడియా వెళ్లారని తెలిపారు. ఇందులో 10 నుంచి 15 మంది ప్రైవేట్ వ్యక్తులతో పాటు సిసోడియా కూడా ఉన్నారని భావిస్తున్నట్టు వివరించారు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణ వరకూ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెల మొదట్లో ఒంగోలు ఎంపీ పేరు ఈ స్కాంలో ప్రముఖంగా వినిపించింది. దీనిపై ఆయన అప్పుడే వివరణ ఇచ్చారు. నిబంధనల ప్రకారం పారదర్శకంగానే తమ కంపెనీ టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నట్టు స్పష్టం చేశారు. ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు లేదు.
గతేడాది నవంబరులోనే నూతన ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చారు. ఐతే.. ప్రైవేటు వ్యాపారులకు లబ్ది చేకూర్చేలా కొన్ని నిబంధనలను ఉల్లంఘన జరిగినట్టు, తద్వారా కొందరు లబ్ది పొందినట్టు విచారణ కమిటీ తేల్చింది. జులైలో ఆ నివేదిక ఇచ్చింది. దీనిపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫార్సు చేశారు. ఇలాంటి విచారణలకు తాము భయపడేది లేదని CM అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.