Karnataka: 'మోదీజీ నన్ను కాపాడండి- నా భార్య చావగొడుతోంది'
Karnataka: భార్య తనను చంపేస్తుందని, కాపాడాలని ప్రధాని మంత్రి మోదీని ట్విట్టర్‌లో సాయం కోరాడు ఓ వ్యక్తి.
Karnataka: ఓ భార్యా బాధితుడు.. ఏకంగా ప్రధాని కార్యాలయానికే ఫిర్యాదు చేశాడు. తన భార్య తనను కొడుతుందటూ కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి ఆరోపించాడు. తనను కాపాడాలని ట్విట్టర్‌లో కోరాడు.
ఇదీ సంగతి
బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య.. అక్టోబర్ 29న ఓ ట్వీట్ చేశాడు. భార్య తనపై కత్తితో దాడి చేసిందని, తనను ఎవరైనా రక్షించాలని కోరాడు.
Would anyone help me? Or did anyone help me when this happened?
— Yadunandan Acharya (@yaadac) October 29, 2022
No, Because I am a man!
My wife attacked me with knife, Is this the naari shakti you boost about? Can I put a domestic violence case against her for this? No!@PMOIndia @KirenRijiju @NyayPrayaas@CPBlr#MenToo pic.twitter.com/VNqtTQ5kPK
తన చేతి నుంచి రక్తం కారుతున్న ఫొటోను కూడా పోస్ట్ చేస్తూ ఈ ట్వీట్ చేశాడు బాధిత వ్యక్తి. తనను చంపుతానని భార్య బెదిరిస్తుందన్నాడు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డికి కూడా ఈ ఫ్యిరాదు ట్వీట్‌ను ట్యాగ్ చేశాడు.
పోలీసులు
ఈ ట్వీట్‌పై బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి స్పందించారు. సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసి న్యాయ సహాయం పొందవచ్చని యదునందన్ ఆచార్యకు ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు.
Also Read: Morbi Bridge Collapse: 'వారిపైనేనా మీ ప్రతాపం- వంతెన కూలిన ఘటనపై సీబీఐ, ఈడీ చర్యలేవి?'