By: ABP Desam, Ram Manohar | Updated at : 13 May 2023 05:59 PM (IST)
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
Karnataka Election Results 2023:
కంగ్రాట్స్: మోదీ
కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్‌కి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తమకు మద్దతు తెలిపిన వారికి థాంక్స్ చెప్పారు. గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో కర్ణాటక ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.
"కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి నా అభినందనలు. ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆశిస్తున్నాను. ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేసిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను. బీజేపీ కార్యకర్తలు గెలుపు కోసం ఎంతో శ్రమించారు. వారందరినీ అభినందనలు తెలుపుతున్నాను. భవిష్యత్‌లో కర్ణాటక ప్రజలకు సేవలు అందించే అవకాశం వస్తుందని భావిస్తున్నాం"
- ప్రధాని నరేంద్ర మోదీ
Congratulations to the Congress Party for their victory in the Karnataka Assembly polls. My best wishes to them in fulfilling people’s aspirations.
— Narendra Modi (@narendramodi) May 13, 2023
I thank all those who have supported us in the Karnataka elections. I appreciate the hardwork of BJP Karyakartas. We shall serve Karnataka with even more vigour in the times to come.
— Narendra Modi (@narendramodi) May 13, 2023
ఈ ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. భారీ మెజార్టీ ఇచ్చినందుకు కర్ణాటక ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. విద్వేష రాజకీయాల్ని కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారని స్పష్టం చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్ వద్ద మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ...ఇది ప్రజల విజయం అని అన్నారు. .రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర గట్టిగానే ప్రభావం చూపించిందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ కూడా ఇదే అన్నారు. మైసూరులో 10 సీట్లున్నాయి. వీటిలో 7 స్థానాల్లో కాంగ్రెస్ పట్ల ప్రజలు సానుకూలత వ్యక్తం చేశారు.
"ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన కర్ణాటక ప్రజలకు నా కృతజ్ఞతలు. కష్టపడి పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు నా అభినందనలు. కర్ణాటకలో కాంగ్రెస్ పేద ప్రజలవైపు నిలబడింది. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే...ఈ సారి మేం ద్వేషంతో పోటీ చేయలేదు. ప్రేమతోనే పోటీ చేశాం. దేశ ప్రజలంతా ప్రేమ పూరిత రాజకీయాలనే కోరుకుంటున్నారని కర్ణాటక ప్రజలు నిరూపించారు. విద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలికారు. ప్రేమపూర్వక రాజకీయాలకే ఓటు వేశారు. ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చుతాం. మొదటి రోజు నుంచే ఈ పని మొదలు పెడతాం"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
#WATCH | "Karnataka mein Nafrat ki bazaar band hui hai, Mohabbat ki dukaan khuli hai": Congress leader Rahul Gandhi on party's thumping victory in #KarnatakaPolls pic.twitter.com/LpkspF1sAz
— ANI (@ANI) May 13, 2023
Also Read: Karnataka Election Results 2023: కర్ణాటక సక్సెస్ క్రెడిట్ అంతా రాహుల్‌కే, జోడో యాత్ర ఎఫెక్ట్ గట్టిగానే ఉందే!
మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్ చేసేందుకు సీఐడీకీ అనుమతి
CIBIL Score: సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా లోన్ వస్తుంది! ఈ చిట్కాలు ప్రయోగించండి
Coin Deposit: బ్యాంక్ అకౌంట్‌లో ఎన్ని నాణేల్ని డిపాజిట్ చేయవచ్చు?
ICAR JRF: ఐసీఏఆర్ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ)-2023 నోటిఫికేషన్, ప్రవేశాలు ఇలా!
Gold-Silver Price Today 30 May 2023: ఎటూ కదలని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
Andhra Politics : వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?