అన్వేషించండి

Kangana Ranaut: 8 క్రిమినల్ కేసులు, 6 కిలోలకు పైగా బంగారం - కంగనా రనౌత్ ఆస్తుల పూర్తి వివరాలివే

Lok Sabha Election 2024: హిమాచల్‌లోని మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కంగనా రనౌత్ అఫిడవిట్‌లో ఆమె ఆస్తుల వివరాలు వెల్లడించారు.

Assets of Kangana Ranaut: హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగనున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్నారు. జూన్ 1వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కంగనా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో (Kangana Ranaut’s Assets) ఆమె ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఈ అఫిడవిట్ ఆధారంగా చూస్తే కంగనా రనౌత్ మొత్తం ఆస్తుల విలువ రూ.91.6 కోట్లు. దీంతో పాటు రూ.4.9 కోట్ల విలువ చేసే 50 LIC పాలసీలున్నాయి. ఈ పాలసీలన్నింటినీ ఆమె 2008లో తీసుకున్నారు. ఇక కంగనాపై 8 క్రిమినల్ కేసులున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అందులో నాలుగు పరువు నష్టం దావాలు కాగా, మత విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు రెండు కేసులు, మత విద్వేషాలు రెచ్చగొట్టినందుకు ఓ కేసు, కాపీరైట్‌ కేసు నమోదయ్యాయి. ఇక ఆస్తుల విషయానికొస్తే చరాస్తుల విలువ రూ.28.73 కోట్లుగా ఉంది. రూ.5.48 కోట్ల విలువైన మూడు హైఎండ్ కార్స్‌తో పాటు రూ.53 వేల విలువ చేసే ఓ వెస్పా స్కూటర్‌ కూడా ఉంది. 6.7 కిలోల బంగారం, 60 కిలోల వెండి, రూ.8.5 కోట్ల విలువ చేసే 14 క్యారట్ డైమండ్స్ ఉన్నట్టు అఫిడవిట్‌లో వెల్లడించారు కంగనా. ఆమె పేరిట రెండు కంపెనీలున్నాయి. ఒకటి మణికర్ణిక ఫిల్మ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ కాగా మరోటి మణికర్ణిక స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రెండు కంపెనీల్లో రూ.1.2లక్షల విలువైన షేర్స్‌ ఉన్నాయి. 

మణికర్ణిక ఫిల్మ్స్‌ కోసం కంగనా రూ.40 లక్షల లోన్ తీసుకున్నారు. ఆమె సోదరుడు అక్షత్ రనౌత్ పేరిట మరో రూ.70.98 లక్షల లోన్ ఉంది. మణికర్ణిక స్పేస్‌ డైరెక్టర్‌ అయిన ఆమె తండ్రి రూ.28.97 కోట్ల లోన్ తీసుకున్నారు. ప్రస్తుతానికి Manikarnika Films బ్యానర్‌పై Emergency సినిమాని ప్రమోట్ చేస్తున్నారు కంగనా రనౌత్. ఇక స్థిరాస్తుల విలువ రూ.62.9కోట్లుగా ఉంది. గత రెండేళ్లలో ఛండీగఢ్‌లో ఆమె రూ.2.46 కోట్ల విలువ చేసే నాలుగు కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుగోలు చేశారు. వీటితో పాటు కులు, ముంబయిలో రూ.28.95కోట్ల విలువైన కమర్షియల్ భవనాలున్నాయి. మహారాష్ట్రలో ఓ ఫ్లాట్‌తో పాటు  హిమాచల్ ప్రదేశ్‌లో ఓ ఇల్లు ఉన్నాయి. ఈ రెండింటి విలువ రూ.31.5 కోట్లు. తనను తాను యాక్టర్‌, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌గా అఫిడవిట్‌లో పేర్కొన్నారు కంగనా. చిన్న వయసులోనే మోడలింగ్‌ రంగంలో అడుగు పెట్టారు. ఛండీగఢ్‌లోని DAV మోడల్ స్కూల్‌లో 12వ తరగతి వరకు చదువుకున్నారు. 2003లో 12th class పాసైన ఆమె ఆ తరవాత చదువు ఆపేశారు. మండి నియోజకవర్గం నుంచి ఈ సారి బరిలోకి దిగనున్న కంగనాకి కాంగ్రెస్‌ తరపున విక్రమాదిత్య సింగ్ ప్రత్యర్థిగా ఉన్నారు. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి వీరభధ్ర సింగ్ కొడుకైన విక్రమాదిత్య సింగ్‌కి స్థానకంగా కాస్త క్యాడర్ ఉంది. అందుకే..వీళ్లిద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. 

 Also Read: Kerala News: వేలికి బదులుగా నాలుకకు సర్జరీ, ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడి నిర్లక్ష్యం

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Free Gas Cylinder Scheme: శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
Singham Again Review - 'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
Bhool Bhulaiyaa 3 Review: భూల్ భులయ్యా 3 రివ్యూ: హిందీ ‘చంద్రముఖి’ సిరీస్‌లో మూడో పార్ట్ - ఎలా ఉంది?
భూల్ భులయ్యా 3 రివ్యూ: హిందీ ‘చంద్రముఖి’ సిరీస్‌లో మూడో పార్ట్ - ఎలా ఉంది?
KTR Padayatra: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర- కార్యకర్తల ఆకాంక్షల మేరకు కీలక నిర్ణయం 
తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర- కార్యకర్తల ఆకాంక్షల మేరకు కీలక నిర్ణయం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లుకేబీఆర్ పార్క్ వద్ద పోర్షే కార్ బీభత్సంLSG Released KL Rahul Retention Players | కెప్టెన్ కేఎల్ రాహుల్ ను వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ | ABP DesamDC Release Rishabh Pant IPL 2025 Retention | పోరాట యోధుడిని వదిలేసుకున్న ఢిల్లీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Gas Cylinder Scheme: శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
Singham Again Review - 'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
Bhool Bhulaiyaa 3 Review: భూల్ భులయ్యా 3 రివ్యూ: హిందీ ‘చంద్రముఖి’ సిరీస్‌లో మూడో పార్ట్ - ఎలా ఉంది?
భూల్ భులయ్యా 3 రివ్యూ: హిందీ ‘చంద్రముఖి’ సిరీస్‌లో మూడో పార్ట్ - ఎలా ఉంది?
KTR Padayatra: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర- కార్యకర్తల ఆకాంక్షల మేరకు కీలక నిర్ణయం 
తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర- కార్యకర్తల ఆకాంక్షల మేరకు కీలక నిర్ణయం 
Rashmika Mandanna - Diwali: దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్ - డైరెక్ట్‌గా చెప్పిన నేషనల్ క్రష్
దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్ - డైరెక్ట్‌గా చెప్పిన నేషనల్ క్రష్
Nara Lokesh In Atlanta: ఎవరినైనా లోపల వేయాలంటే రెండు నిమిషాల పని : లోకేష్‌
ఎవరినైనా లోపల వేయాలంటే రెండు నిమిషాల పని : లోకేష్‌
Sankranthiki Vasthunnam First Look: సంక్రాంతికి వస్తున్నాం... ఫస్ట్ లుక్కే కాదు, రిలీజ్ అప్డేట్ కూడా ఇచ్చిన వెంకటేష్
సంక్రాంతికి వస్తున్నాం... ఫస్ట్ లుక్కే కాదు, రిలీజ్ అప్డేట్ కూడా ఇచ్చిన వెంకటేష్
LPG Cylinder Rates Today :దీపావళి రోజే బాంబు పేల్చిన చమురు సంస్థలు- LPG సిలిండర్‌పై భారం, మీ ప్రాంతంలో కొత్త రేట్లు చూడండి
దీపావళి రోజే బాంబు పేల్చిన చమురు సంస్థలు- LPG సిలిండర్‌పై భారం, మీ ప్రాంతంలో కొత్త రేట్లు చూడండి
Embed widget