Viral News: విలాసవంతమైన బంగ్లాని అమ్మకానికి పెట్టిన కంగనా, ధర రూ.40 కోట్లు - హోమ్ టూర్ వీడియో
Kangana Ranaut: ముంబయిలోని తన విలావసంతమైన బంగ్లానికి కంగనా రనౌత్ అమ్మకానికి పెట్టారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ బంగ్లా విలువ రూ.40కోట్లుగా ఉంది.
Kangana Ranaut's Bunglow: ముంబయిలోని పై హిల్ వద్ద ఉన్న తన విలాసవంతమైన బంగ్లాని కంగనా రనౌత్ అమ్మకానికి పెట్టింది. 2020లో ఈ బంగ్లా వార్తల్లో నిలిచింది. అప్పట్లో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఈ బంగ్లాని పాక్షికంగా ధ్వంసం చేసింది. అక్రమంగా నిర్మించారని తేల్చి చెప్పింది. అయితే..ఇప్పుడిదే బంగ్లాని కంగనా అమ్మేస్తున్నారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ బంగ్లా వీడియోని యూట్యూబ్‌లో షేర్ చేసింది. బంగ్లా ఇంటీరియర్‌ని వీడియో తీసి పోస్ట్ చేసింది. రూ.40 కోట్లకు అమ్మకానికి పెట్టింది. ఈ బంగ్లాలోనే కంగనా రనౌత్ మణికర్ణిక ఫిల్మ్స్ ఆఫీస్ ఉంది. ఈ ఇంటీరియర్‌ని ఫేమస్ ఆర్కిటెక్ట్ షబ్నామ్ గుప్తా డిజైన్ చేశారు. ఎడిటింగ్ స్టూడియో, చెక్కతో తయారు చేసిన మెట్లు, విశాలమైన వర్క్ ప్లేస్‌తో పాటు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ రూమ్, డిస్కషన్ రూమ్స్‌నీ కట్టారు. రెండో అంతస్తులో మీటింగ్ ఏరియా ఉంది. పర్షియన్ స్టైల్‌లో నిర్మించినప్పటికీ ఇండియన్ స్టైల్‌నీ జోడించారు. రాజస్థాన్ నుంచి ఫర్నిచర్ తెప్పించారు.
2020లో కంగనా రనౌత్ తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఈ బంగ్లా ఇంటీరియర్ ఫొటోలు షేర్ చేసింది. అప్పట్లో ఇవి వైరల్ అయ్యాయి. మొత్తం 3వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లాలో 500 స్క్వేర్ ఫీట్స్ పార్కింగ్ ప్లేస్ ఉంది. మొత్తం మూడు అంతస్తుల్లో కళ్లు చెదిరే విధంగా నిర్మించారు. 2020లో మున్సిపల్ అధికారులు ఈ బంగ్లాని పాక్షికంగా ధ్వంసం చేసిన కొద్ది గంటల్లోనే కంగనా రనౌత్ కోర్టుకెక్కారు. ఆస్తినష్టం కింద రూ.2 కోట్లు కట్టాలని డిమాండ్ చేశారు. ఎంతో విలువైన వస్తువులు ధ్వంసం అయ్యాయని మండి పడ్డారు. కానీ ఆ తరవాత ఈ పరిహారంపై మాట మార్చారు. పూర్తిగా పక్కన పెట్టారు. ఇప్పుడు అమ్మకానికి పెట్టడం వల్ల మరోసారి ఈ బంగ్లా వార్తల్లో నిలిచింది.
View this post on Instagram
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గమైన మండి నుంచి పోటీ చేసి విజయం సాధించారు కంగనా రనౌత్. ఇటీవలో లోక్‌సభలో తొలిసారి ప్రసంగించారు. ముందు నుంచి ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చాక దూకుడు మరింత పెంచారు. కాంగ్రెస్‌ని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమాలు తగ్గించి పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టనున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ వర్సెస్ అనురాగ్ ఠాకూర్ వ్యవహారంలోనూ చాలా గట్టిగానే మాట్లాడారు. రాహుల్ ఏం మాట్లాడుతున్నారో అర్థమే లేదని మండి పడ్డారు. కన్వార్ యాత్ర వివాదంపైనా యూపీ సర్కార్‌కి మద్దతునిస్తూ పోస్ట్‌లు పెట్టారు.
Also Read: Amit Shah: 2029 లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా సంచలన అంచనాలు, అదే నిజమవుతుందా?