బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వాహనంపై దాడి జరిగింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్ వెళ్తుండగా కొందరు రైతులు తన వాహనంపై దాడి చేసినట్లు కంగనా ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తనపై దుర్భాషలాడినట్లు, చంపేస్తానని బెదిరించినట్లు కంగనా ఆరోపించారు.
నేను పంజాబ్‌లోకి ప్రవేశించిన వెంటనే.. ఓ మూక నా వాహనంపై దాడి చేసింది. మేం రైతులమని వాళ్లు చెప్పారు. ఒకవేళ అక్కడ పోలీసులు లేకపోతే నాపై మూక దాడి జరుగుండేది. నా విమానం క్యాన్సిల్ కావడంతో హిమాచల్ నుంచి పంజాబ్‌కు రోడ్డు మార్గంలో వెళ్లాను. నన్ను చంపేస్తామని బెదిరించారు. - కంగనా రనౌత్, సినీ నటి
సాగు చట్టాలపై రైతులు చేసిన ఉద్యమంపై ఇటీవల కంగనా రనౌత్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటన చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో భారత్‌ను 'జిహాదిస్ట్ నేషన్' అని పిలిచారు. సిక్కులను 'ఖలిస్థానీలు'గా కంగనా పిలిచారు.