'అఖండ' విడుదల తర్వాత హీరో నాని 'బాలకృష్ణగారు గేట్స్ ఓపెన్ చేశారు' అని ట్వీట్ చేశారు. దీని వెనుక చాలా అర్థం ఉంది! అదేంటంటే... టాలీవుడ్‌కు నట సింహ నందమూరి బాలకృష్ణ ఇచ్చిన భరోసా. తెలుగు హీరోలు మీనమేషాలు లెక్కిస్తున్న సమయంలో బాలకృష్ణ ధైర్యంగా ముందడుగు వేశారు. లేటెస్ట్ 'అఖండ' సినిమా విడుదలతో ఇండస్ట్రీలో నెలకొన్న భయాలను పోగొట్టారు. ఎలా అంటారా? కరోనా రెండో దశ తర్వాత లాక్‌డౌన్ తొలగించినా... థియేటర్లు వెంటనే ఓపెన్ కాలేదు. అప్పట్లో ఏపీలో మూడు షోలు ఉండటం... ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రారా? అనే సందేహాల నడుమ సినిమాలు విడుదల చేయడానికి కొంత ఆలోచించారు. కొన్ని రోజులు వేచి చూశారు.
ఏపీలో మూడు షోలు ఉన్నా పర్వాలేదని కొందరు సినిమాలు విడుదల చేశారు. అప్పట్లో వచ్చిన లో బడ్జెట్ సినిమాలు కొన్ని మంచి టాక్ తెచ్చుకున్నాయి. 'లవ్ స్టోరీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వచ్చాయి. అవి ఫ్యామిలీ డ్రామాలు. ఆయా సినిమాలతో పోలిస్తే... త్వరలో విడుదలకు రెడీగా ఉన్నవి భారీ బడ్జెట్ సినిమాలు. 'లవ్ స్టోరీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమాలతో పోలిస్తే... భారీ ఓపెనింగ్స్ రావాలి. వస్తాయా? లేవా? ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రారా? అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందువల్లే, 'ఆర్ఆర్ఆర్' కూడా వాయిదా పడింది. ఈ తరుణంలో ఏ పెద్ద సినిమా విడుదల అవుతుంది? ఇండస్ట్రీలో భయాలకు ఎవరు బదులు ఇస్తారు? అని ఎదురు చూశారు. అన్నిటికీ బాలకృష్ణ సమాధానం ఇచ్చారు. 'అఖండ'కు వస్తున్న స్పందన సమాధానం ఇచ్చింది.
'అఖండ' పక్కా మాస్ మసాలా కమర్షియల్ సినిమా. కరోనాలో ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారని, కాలం చెల్లిన కథలతో సినిమాలు తీస్తే ఎవరూ చూడరనే కామెంట్లు ఆ మధ్య వినిపించాయి. అయితే... తెలుగు ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలకు అభిమానులు అని 'అఖండ' సినిమా మరోసారి నిరూపించింది. ఫస్ట్ డే 'అఖండ'ను చూడటానికి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను చూసి ఇండస్ట్రీ జనాలు కూడా చాలా సంతోషించారు. అందువల్ల, పాజిటివ్ రిపోర్ట్స్ చూసి మహేష్ బాబు, ఎన్టీఆర్ తదితర హీరోలు మొదలుకుని ఇండస్ట్రీలో చిన్న హీరోల వరకూ 'అఖండ' ఆదరణపై ట్వీట్లు వేశారు. ఇప్పుడు ఇండస్ట్రీకి ఓ ధైర్యం వచ్చింది. హ్యాపీగా భారీ సినిమాలు విడుదల చేసుకోవచ్చని అందరూ అనుకుంటున్నారు.
Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
'అఖండ' తర్వాత ఈ నెల 17న 'పుష్ప' విడుదల అవుతోంది. ఆ తర్వాత 24న నాని 'శ్యామ్ సింగ రాయ్' వస్తుంది. జనవరిలో 7న 'ఆర్ఆర్ఆర్', 12న 'భీమ్లా నాయక్', 14న 'రాధే శ్యామ్' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాలు అన్నిటికీ భారీ ఓపెనింగ్స్ వస్తాయని 'అఖండ'లు లభిస్తోన్న ఆదరణతో స్పష్టం అయ్యింది. ఆ తర్వాత ఎంత కలెక్ట్ చేస్తాయనేది ఆ సినిమాల్లో కంటెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది.
Also Read: 'మరక్కార్' రివ్యూ: మనకు తెలియని యోధుడు... తెలిసిన సినిమా!
Also Read: సూపర్ స్టార్ మోకాలికి సర్జరీ.. రెండు నెలలు ఇంట్లోనే..
Also Read: తల్లితో సమంత వాట్సాప్ చాట్... ఆ ఆత్మవిశ్వాసానికి సలామ్ కొట్టాల్సిందే
Also Read: టికెట్ రేట్లపై ఏపీ సర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంటర్!?
Also Read: ‘పుష్ప’ హిందీ రిలీజ్ తేదీ ఖరారు.. ఆ రోజు తగ్గేదేలే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి