సినిమా, సినిమా హాళ్లు బతకడానికి అవకాశం ఇవ్వమని హీరో సిద్ధార్థ్ (Siddharth) ట్విట్టర్ వేదికగా కోరారు. గురువారం ఆయన సినిమా టికెట్ రేట్స్ గురించి పలు ట్వీట్లు చేశారు. ప్రభుత్వాలకు అంటూ పేర్కొన్నప్పటికీ... ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ఆయా ట్వీట్లు చేశారని మెజారిటీ జనాల అభిప్రాయం. "మీరు ఓ ప్లేట్ ఇడ్లీ లేదా కాఫీ ఎంతకు అమ్మాలో ఏసీ రెస్టారెంట్లకు చెప్పరు. కానీ, సినిమా ఇండస్ట్రీనే ఎప్పుడూ ఎందుకు సమస్యాత్మక పరిశ్రమగా ప్రభుత్వాలు చూస్తున్నాయి? వాళ్ల పెట్టుబడి ఎలా తిరిగి రాబట్టుకోవాలో ఎందుకు చెబుతున్నారు?" అని సిద్ధార్థ్ ప్రశ్నించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లపై ఓ జీవో విడుదల చేసింది. అందులో గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్లలో రేటు ఐదు రూపాయలు అని కూడా ఉంది. సింగిల్ టీ కూడా అంతకంటే ఎక్కువ రేటు ఉన్నప్పుడు... సినిమా టికెట్ అంతకు అమ్మితే నిర్మాతల బతికేదెలా? అంటూ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ చేసిన ట్వీట్లు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టు ఉన్నాయనేది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం.
సిద్ధార్థ్ కేవలం ట్వీట్లు చేయడం వరకు పరిమితం కాలేదు. చట్టాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. రోజుకు ఎన్ని షోలు వేయాలి? టికెట్ రేట్ ఎంత ఉండాలి? అనే విషయంలో పరిమితులు విధించడం MRTP (Monopolistic and Restrictive Trade Practice under MRTP Act, 1969) చట్టాన్ని ఉల్లఘించడమేనని ఆయన తెలిపారు. ఓ ప్రాంతంలో రెంట్స్ (ఇళ్ల అద్దెలు) ఎలా ఉన్నాయో తెలుసుకుని ఏవరేజ్ రెంట్ క్యాలిక్యులేట్ చేసి టికెట్ రేట్స్ నిర్ణయించమని ప్రభుత్వాలకు ఆయన సలహా ఇచ్చారు.
ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు టికెట్ రేట్లు నిర్ణయించే అధికారం లేదని సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు. సినిమా కంటే లిక్కర్, పొగాకు (సిగరెట్)కు ఎక్కువ గౌరవం ఇస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. #SaveCinema అంటూ నినదించారు. "మా వ్యాపారం ఎలా చేయాలో మాకు చెప్పొద్దు. మాకు పన్నులు విధించండి. సినిమాలు సెన్సార్ చేయండి. మీరు ఎప్పుడూ చేసేట్టు... ఇల్లీగల్ గా. నిర్మాతలను, సినిమా పరిశ్రమపై ఆధారపడి బతికేవాళ్లను వాళ్ల జీవితాల నుంచి గెంటేయకండి. ఎవరూ సినిమా చూడమని ఫోర్స్ చేయడం లేదు. సినిమా బడ్జెట్, స్కేల్ ను ప్రేక్షకుడు నిర్ణయించలేడు. దానిని క్రియేటర్, ఇన్వెస్టర్ నిర్ణయిస్తాడు. సినిమా నుంచి ఎంత సంపాదించాలనే అధికారం ఎవరికీ లేదు. పేదరికం నుంచి వచ్చి లక్షాధికారులుగా ఎదిగిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలను ఎవరైనా ప్రశ్నిస్తారా? సినిమా ఇండస్ట్రీని అంచనా వేయడం ఆపండి" అని సిద్దార్థ్ ట్వీట్స్ చేశారు.
Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Also Read: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...
Also Read: సెట్స్‌కు వచ్చిన మెగాస్టార్... నెర్వస్‌లో డైరెక్టర్
Also Read: రజనీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన దర్శకుడితో విక్రమ్... దళిత్ సినిమా కన్ఫర్మ్
Also Read: బికినీ షోలో ఇలియానా తర్వాతే ఎవరైనా అనేలా...
Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో డబ్బింగ్ థియేటర్‌లో నయనతార...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి