గుజరాత్‌లో ముస్లిం వ్యతిరేక అల్లర్లు ఏ పార్టీ ప్రభుత్వ హయంలో జరిగాయని.. సీబీఎస్ఈ 12వ తరగతి సోషియాలజీ ప్రశ్నాపత్రంలో అడిగింది. అయితే ఈ ప్రశ్నపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ స్పందించింది. ప్రశ్నా పత్రం తయారీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి ప్రశ్నలు వేయడం సరికాదని పేర్కొంది. 


డిసెంబర్ 1న  2వ తరగతి సోషియాలజీ బోర్డు పరీక్ష జరిగింది. అయితే ఇందులో.. 2002లో గుజరాత్‌లో ముస్లిం వ్యతిరేక అలర్ల వ్యాప్తి ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది? అని ప్రశ్నించింది. 


మరోవైపు విద్యార్థులకు కాంగ్రెస్, బీజేపీ, డెమోక్రటిక్ మరియు రిపబ్లికన్ అంటూ ఆప్షన్లు ఇచ్చింది.


ఈ ప్రశ్నపై వివాదం చేలరేగడంతో సీబీఎస్ఈ స్పందించింది. దీనిపై సీబీఎస్ఈకి ఫిర్యాదులు వెళ్లాయి. 'ఈ ప్రశ్న సీబీఎస్ఈ  మార్గదర్శకాల ఉల్లంఘన. నేటి 12వ తరగతి సోషియాలజీ టర్మ్-1 పరీక్షలో అడిగిన ఓ ప్రశ్న. ఇది సరియైనది కాదు. సబ్జెక్ట్ లో లేని ప్రశ్న.. సీబీఎస్ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించేలా ఉంది. ప్రశ్న పత్రాలను సెట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఈ లోపాన్ని సీబీఎస్ఈ అంగీకరిస్తుంది మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుంది.' అని సీబీఎస్ఈ ట్వీట్ చేసింది.






'పేపర్ సెట్టర్‌లకు సీబీఎస్ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా అకడమిక్-ఓరియెంటెడ్‌ ప్రశ్నలు ఉండాలని చెప్పాం.  సామాజిక, రాజకీయ అంశాల ఆధారంగా ప్రజల మనోభావాలకు దెబ్బతీసెలా ఉండొద్దని తెలిపాం.' అని మరో ట్వీట్ చేసింది.





 Also Read: AP EAMCET Counselling 2021: ఏపీ ఎంసెట్ రెండో రౌండ్ కౌన్సెలింగ్.. విద్యార్థులు చేయాల్సిన పని ఇదే..


Also Read: ట్విట్టర్ నుంచి గుగూల్ సీఈవో వరకు అగ్రస్థానంలో ఉన్న.. ఐఐటీ, ఐఐఎమ్ గ్రాడ్యుయేట్లు వీళ్లే.. 


Also Read: Internship: ఇంట‌ర్న్‌షిప్‌తో ఉద్యోగావకాశాలెక్కువ.. ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రముఖ కంపెనీల్లో చేసేయండి