భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన ఐదుగురు మావోయిస్టులు ఎస్పీ సునీల్ దత్ ఎదుట లొంగిపోయారు. బుధవారం ఎస్పీ సునీల్ దత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. చర్ల మండలానికి చెందిన ముగ్గురు మిలీషియా సభ్యులు, ఇద్దరు గ్రామ కమిటీ సభ్యులు లొంగిపోయినట్లు తెలిపారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కోరారు. 


Also Read: ఆర్టీసీ టికెట్ చార్జీల పెంపునకు సర్వం సిద్ధం.. కేసీఆర్ వద్ద ఫైల్, బస్సుల వారీగా పెరగనున్న వివరాలివే..


భద్రాద్రి కొత్త గూడెం చర్ల మండలం కొండవాయి గ్రామానికి చెందిన నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన గ్రామ కమిటీ సభ్యులు ముగ్గురు, ఇద్దరు మిలీషియా సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు గ్రామ కమిటీ సభ్యులు దూధి గంగ(40) s/o భీమా, పొడియం ఆదమయ్య అలియాస్ చైతు(33) s/o ఇరామయ్య, ముస్కి కొసయ్య అలియాస్ మల్ల(28) s/o సింగయ్య, మిలీషియా సభ్యులు పొడియం రాజే(18) s/o అంధయ్య, సోడి గంగి(18) w/o జోగయ్య లొంగిపోయారని ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. ఈ ఐదుగురు సభ్యులను చర్ల ప్రాంతంలో సాధారణ కమ్యూనిటీ పోలీసులు, గ్రామస్తులు, వారి బంధువులు పోలీసుల ముందు లొంగిపోయేలా ఒప్పించారని ఎస్పీ చెప్పారు. లొంగిపోవడానికి, మెరుగైన జీవితాన్ని గడపడానికి ఎవరైనా బంధువులు లేదా పోలీసులను సంప్రదించాలని మావోస్టులను విజ్ఞప్తి చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. 


Also Read: శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి... ఆమె దగ్గర ఎంత కొట్టేశారంటే?


ఇటీవల విశాఖలో.. 


నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ పెదబయలు దళానికి చెందిన ఇద్దరు మహిళా సభ్యులు నవంబర్ 11న విశాఖ జిల్లా ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయారు. ఎస్పీ కృష్ణారావు లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను మీడియాకు తెలిపారు. 'చింతపల్లి మండలానికి చెందిన తాంబేలు సీత అలియాస్‌ నిర్మల, పాంగి లచ్చి అలియాస్‌ శైలు 2017 నుంచి మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. మావోయిస్టులు సుధీర్‌, అశోక్‌, శ్రీకాంత్‌, భవాని, శ్వేత తరచుగా సమావేశాలు పెట్టడంతో వారి మాటలకు ఆకర్షితులై సీత, శైలు మావోయిస్టు పార్టీలో చేరారు. హత్యలు, అపహరణలు, మందుపాతర్ల పేలుడు, ఎదురు కాల్పుల్లో వీళ్లిద్దరూ పాల్గొన్నారు. మావోయిస్టుల ప్రాభల్యం తగ్గిపోవడంతో వీరిని ఆలోచనలో పడేసింది. అనారోగ్యం బారిన పడినా పార్టీ పట్టించుకోలేదని, కొందరు ఎదురు కాల్పుల్లో చనిపోవడంతో ప్రశాంతంగా బతకాలనే వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారు' అని ఎస్పీ పేర్కొన్నారు. ఇటీవల మావోయిస్టు సుధీర్‌ లొంగుబాటు కూడా వీరిపై ప్రభావం చూపిందని ఎస్పీ అన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు వచ్చేలా చూసి జీవనోపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. మిగతా మావోయిస్టులు కూడా స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. 


Also Read: Khammam: స్నేహితులతో కలిసి భార్యను కిడ్నాప్ చేయించిన భర్త.. అర్ధరాత్రి కారులో ఎత్తుకెళ్లి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి