కరోనా సెకండ్ వేవ్ తరువాత టాలీవుడ్ హీరోలంతా కూడా తమ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. కరోనాతో ఎక్కువ గ్యాప్ రావడంతో వీలైనంత త్వరగా సినిమాలను పూర్తి చేయాలనే ఆలోచనతో ఎక్కువ సమయం పనిచేస్తూ.. ఒత్తిడికి గురవుతున్నారు. శ్రమ ఎక్కువవడంతో కొందరు హీరోలపై ఫిజికల్ గా కూడా ఎఫెక్ట్ పడుతోంది. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి హీరోలకు షూటింగ్ సమయంలో గాయాలైన సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలయ్య కూడా తన భుజానికి ఆపరేషన్ చేయించుకున్నారు. 


ఈ కారణాల వలనే కొత్త సినిమాలను మొదలుపెట్టలేకపోతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు చాలా కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో నొప్పి మరింత ఎక్కువ అవ్వడంతో.. మహేష్ డాక్టర్ కి చూపించున్నట్లు తెలుస్తోంది. శాశ్వత పరిష్కారమంటే.. శస్త్ర చికిత్స చేయించుకోవడం మంచిదని సజెస్ట్ చేసినట్లు సమాచారం. దీంతో మహేష్ ఆపరేషన్ చేయించుకోవడానికి రెడీ అవుతున్నారు. 


హైదరాబాద్ లోనే ఓ ప్రముఖ ఆర్థోపెడీషియన్ సర్జరీ చేయనున్నట్లు తెలిసింది. ఆపరేషన్ జరిగిన తరువాత మహేష్ బాబు రెండు నెలల పాటు ఎక్కడకి కదలడానికి వీలు లేదట. అందుకే షూటింగ్స్ తో పాటు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకోబోతున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పార్ట్ కి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది. బ్యాలెన్స్ సన్నివేశాలు ఏమైనా ఉంటే.. అవి కూడా పూర్తి చేసి అప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారు మహేష్ బాబు. 


సినిమా రిలీజ్ ఏప్రిల్ లో కాబట్టి అప్పటికి రికవర్ అయిపోయి.. ప్రమోషన్స్ మొదలుపెడతారు. నిజానికి మహేష్ బాబు సినిమా సినిమాకి మధ్యలో ఫారెన్ ట్రిప్ కు వెళ్తుంటారు. వచ్చిన తరువాత కొత్తం సినిమాను మొదలుపెడతారు. కానీ ఈసారి రెండు నెలల పాటు ఆయన ఇంట్లోనే బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇక వచ్చే ఏడాదిలోనే తన కొత్త సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టార్ట్ చేయనున్నారు మహేష్ బాబు. 


Also Read: కంగ్రాట్స్ బాలా బాబాయ్... అబ్బాయ్ ట్వీట్ చూశారా? మహేష్ కూడా!


Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!


Also Read: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...


Also Read: సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి