తెలంగాణలో ఎదురవుతున్న రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ తను నేరుగా స్ట్రాటజిస్ట్‌గా పని చేయబోవడం లేదని ప్రకటించారు. అయితే ఆయనకు చెందిన "ఐ ప్యాక్" సంస్థ మాత్రం రాజకీయ పార్టీలకు సేవలు అందిస్తోంది. ఇటీవల టీఆర్ఎస్ ప్రశాంత్ కిషోర్‌ను సంప్రదించడంతో ఆయన బృందం  ప్రత్యేకంగా ప్రగతి భవన్‌కు వచ్చి కేసీఆర్‌తో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. 


Also Read : పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడిన కేసీఆర్.. వరి పంటకు బదులు.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని సూచన


ఇటీవల కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రశాంత్ కిషోర్‌తో ఓ సారి చర్చించారని.. దానికి కొనసాగింపుగానే ఆయ టీం హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌తో సమావేశం అయిందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా మూడు అంశాలపై పీకే టీమ్‌ వర్క్ చేయాలని కేసీఆర్ కోరినట్లుగా తెలుస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రతికూల ఫలితం రావడానికి దారితీసిన కారణలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి, జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించాలన్నదానిపై పీకే టీం సలహాలు, సూచనలు కేసీఆర్ అడిగినట్లుగా సమాచారం. 


Also Read: ఏపీ, ఒడిశాపై జవాద్ తుపాను ప్రభావం... 100కు పైగా రైళ్ల రద్దు... ప్రధాని మోదీ సమీక్ష


టీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేరకత పెరిగిందా.. పెరిగిదే దానికి కారణాలేమిటో సర్వే చేసి చెప్పేందుకు పీకే టీం ఇప్పటికే రంగంలోకి దిగింది. కేసీఆర్ ఎక్కువగా ప్రైవేటు సంస్థల సర్వేలు, ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్‌పై ఆధారపడుతూ ఉంటారు. అయితే అవి పూర్తి స్థాయిలో వాస్తవికంగా ఉండటం లేదన్న అభిప్రాయంతో ఉన్న ఆయన పీకే టీమ్‌ ద్వారా సర్వే చేయిస్తున్నట్లుగా చెబుతున్నారు. పీకే టీఎం సర్వే రిపోర్ట్ ఆధారంగా దిద్దుబాటు చర్యలతో పాటు ప్రజల నమ్మకాన్ని గెల్చుకోడానికి తగిన వ్యూహాన్ని కేసీఆర్ సిద్ధం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. 


Also Read: Crime News: బావ వేధింపులు తాళలేక వివాహిత సెల్ఫీ సూసైడ్... మరోచోట కానిస్టేబుల్ బెదిరింపులతో మహిళా వాలంటీర్ ఆత్మహత్య


అయితే అపర చాణక్యునిగా పేరు పొందిన కేసీఆర్ .. రాజకీయ వ్యూహాల కోసం పీకేను నమ్ముకుంటారని టీఆర్ఎస్ వర్గాలు నమ్మలేకపోతున్నాయి. అయితే జాతీయ రాజకీయాల విషయంలో మాత్రం పీకే సలహాలను కేసీఆర్ తీసుకుంటారని భావిస్తున్నారు. మమతా బెనర్జీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మమతా బెనర్జీ కోసం ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీల కూటమికి టీఆర్ఎస్‌ను దగ్గర చేసేందుకు పీకే తన టీం ద్వారా ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. 


Also Read : ఒమిక్రాన్ ఎప్పుడైనా రావొచ్చు... తెలంగాణలో హైఅలర్ట్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి