కడప జిల్లాను ఇటీవల బీభత్సమైన వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ వరదలకు ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అంతా ప్రాణాలు కాపాడుకొనేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ఎంతో శ్రమించారు. ఇళ్లన్నింటినీ వరద ముంచెత్తి చాలా వరకూ దెబ్బతిన్నాయి. ప్రాణాలు కాపాడుకొనేందుకు వెళ్లిన వారు తిరిగి వచ్చేసరికి ఏమీ మిగలని పరిస్థితి నెలకొంది. అయితే, ప్రజలు ప్రాణాలు దక్కించుకొనేలా చేయడంలో ఓ వ్యక్తి మాత్రం కీలక పాత్ర పోషించాడు. చెయ్యేరు పరిధిలోని వరద ప్రభావిత గ్రామాల్లో పల్లె పల్లెకు తిరిగి ఓ శివరామయ్య అనే వ్యక్తి చాటింపు వేశాడు. తొగూరుపేట, పాలెపేట, రామచంద్ర పురం గ్రామాల్లో తిరిగి అందరినీ సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాలని గట్టిగా అరుస్తూ చాటింపు వేశాడు.


ఓ వైపు వరద.. మరోవైపు భారీ వర్షం కురుస్తున్న వేళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మూడు గ్రామాలు తిరిగి సమాచారం ఇచ్చాడు. నడవలేని వారిని స్వయంగా ఎత్తుకొని వెళ్లి మరీ సమీపంలోని దాసాలమ్మ గుట్ట ఎక్కించాడు. మొత్తానికి 40 కుటుంబాలు, ఆవులు, పశువుల తరలింపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆపద్భాందవుడిగా శివరామయ్య పేరు తెచ్చుకున్నాడు. 


అధికారుల నిర్లక్ష్యం వల్లే మాకు వరద: శివరామయ్య
‘ఏబీపీ దేశం’ కడప జిల్లాలో వరద బాధితులతో మాట్లాడిన సందర్భంగా వారు తొగూరు పేటకు చెందిన శివరామయ్య గురించి చెప్పుకొచ్చారు. శివరామయ్య ఏబీపీ దేశంతో మాట్లాడుతూ.. 20 రోజులకు పైగా నిరంతరంగా వర్షం కురుస్తుంటే.. చెయ్యేరు నదిపై ఉన్న జలాశయం గేట్లను అధికారులు ఎందుకు ఎత్తలేదని ప్రశ్నించారు. వరద గురించి తమకు అధికారులు ఎవరూ సమాచారం ఇవ్వలేదని తెలిపారు. దిగువన ఇసుక తరలించుకొనేందు కోసమే డ్యాం గేట్లు ఎత్తలేదని శివరామయ్య అనుమానం వ్యక్తం చేశారు. అన్ని దిక్కుల నుంచి జలాశయానికి వరద నీరు వస్తుందని.. ఇలా వరద ధాటికి ఫించా డ్యాం కూడా తెగిపోయిందని తెలిపారు. అది చూసి కూడా చెయ్యేరు నదిపై డ్యాం గేట్లు తీయలేదని గుర్తు చేశారు. కావాలని నీటిని నిల్వ చేసి తమకు పాడు చేశారని అన్నారు. అసలు ఇలాంటి వరద ఎన్నడూ లేదని గుర్తు చేసుకున్నారు.



వరదల సమయంలో చిమ్మని చీకట్లో నానా ఇబ్బందులు పడ్డామని శివరామయ్య చెప్పారు. కనీసం తినేందుకు తిండి కూడా లేని పరిస్థితి నెలకొందని తెలిపారు. మధ్యలో ఓ హెలికాప్టర్ ద్వారా వచ్చి కొంత మంది బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారని తెలిపారు. తాము పండించిన వడ్లు, ఇతర పంట ధాన్యం మొత్తం కొట్టుకుపోయిందని, ప్రభుత్వం కేవలం రూ.90 వేల చెక్కు అందించినందని తెలిపారు. ఆ ఆర్థిక సాయంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.


Also Read: Nellore Crime: మూడు నెలల క్రితమే పెళ్లి.. ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకున్న మహిళా పోలీస్


Also Read: Nude Call Fraud: వీడియో కాల్ ఎత్తగానే నగ్నంగా కనపడ్డ యువతి.. టెంప్ట్ అయిన టెకీ, తాను కూడా.. చివరికి.. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి