అన్వేషించండి

Joe Biden: సాయంత్రం 4 దాటితే అంతా అయోమయమే, బైడెన్ ప్రవర్తనపై సంచలన రిపోర్ట్

Joe Biden Age: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ సంచలన రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది.

Joe Biden Health Status: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన పట్ల ఈ మధ్య కాలంలో బాగానే చర్చ జరుగుతోంది. మరి కొద్ది నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఆయన వయసైపోయిందని, ప్రెసిడెంట్ పదవికి తగరని రిపబ్లికన్‌లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లోనూ బైడెన్ పెద్దగా మాట్లాడలేకపోయారు. ట్రంప్‌కి దీటుగా సమాధానాలు ఇవ్వలేకపోయారు. ఈ క్రమంలోనే బైడెన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఓ రిపోర్ట్ సంచలన విషయాలు వెల్లడించింది. ఆయన కేవలం ఆరు గంటలు మాత్రమే పని చేయగలరని స్పష్టం చేసింది. అది కూడా వెలుగు ఉన్నప్పుడే అని తేల్చి చెప్పింది. కాస్తంత చీకటి పడగానే ఆయన తీరులో మార్పు వస్తోందని, ఏ పనీ చేయలేకోపోతున్నారని వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఆయన పని చేయగలరని వివరించింది. సాయంత్రం 4 గంటలు దాటితే విపరీతమైన నీరసానికి గురవుతున్నారని, విదేశాలకు వెళ్లాల్సి వచ్చిన సమయంలోనూ ఇదే విధంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. ఇదంతా చూస్తుంటే ఆయన మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనా ఎక్కువ కాలం పని చేయగలరా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోందని ఈ రిపోర్ట్ తెలిపింది.

అంతే కాదు. ఆయన ఎక్కువ సమయం బయట ఉండకుండా షెడ్యూల్‌ని ప్లాన్ చేసుకుంటున్నారనీ వాదించింది. ఇప్పటికే ఆయన ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. ఉన్నట్టుండి ఫ్రీజ్ అయిపోవడం, ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడం లాంటివి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇలాంటి వ్యక్తికి మరోసారి అధ్యక్షుడిగా అవకాశం ఎలా ఇస్తారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే...వైట్‌హౌజ్‌లోని అధికారులు వెల్లడించిన వివరాల ఆధారంగా చూస్తే..చాలా సార్లు బైడెన్ వింతగా ప్రవర్తిస్తున్నారని తెలిసింది. అందుకే ఆయన ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు మెంటల్ స్టెబిలిటీపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నమన్న వైసీపీ నేత
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నమన్న వైసీపీ నేత
Atchannaidu: జలధార జలహారతితో 79,826 పనులు పూర్తి.. భూగర్భ జలాలు 0.79 మీటర్లు పెరుగుదల: అచ్చెన్నాయుడు
జలధార జలహారతితో 79,826 పనులు పూర్తి.. భూగర్భ జలాలు 0.79 మీటర్లు పెరుగుదల: అచ్చెన్నాయుడు
MLA Danam Nagender Disqualification: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు
ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
రూ.10 లక్షల లోపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌.. బలెనో, i20లో మీకు ఏది సరిపోతుందంటే?
బలెనో vs i20.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ఎక్కువ ఫీచర్లు ఇస్తుందో తెలుసా?
Embed widget