ఆ విషయంలో భారత్‌లోని ఉద్యోగులే బెస్ట్, జపాన్ లాస్ట్ - ఆసక్తికర సర్వే
Global Survey of Employees: ఉద్యోగుల బాగోగులు చూసుకునే విషయంలో జపాన్ చివరి ర్యాంక్ సాధించింది.
Global Survey of Employees 2023:
గ్లోబల్ సర్వే..
వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్‌ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి ఏ ముహూర్తాన అన్నారో కానీ..అప్పటి నుంచి వరుస పెట్టి కొన్ని నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత్‌లోని ఉద్యోగులే ఎక్కువ గంటల పాటు పని చేస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఇప్పుడు మరో రిపోర్ట్ కీలక విషయాలు చెప్పింది. ఉద్యోగుల బాగోగులపై McKinsey Health Institute సర్వే చేపట్టింది. ఈ సర్వే విడుదల చేసిన జాబితాలో జపాన్ చిట్ట చివరిలో ఉంది. ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యంపై అధ్యయనం చేసింది ఈ సంస్థ. మొత్తం 30 దేశాల్లో అధ్యయనం చేయగా..జపాన్‌కి చివరి ర్యాంక్ దక్కింది. జపాన్‌లో 30 వేల మంది ఉద్యోగులతో మాట్లాడగా అందులో 25% మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నట్టు వెల్లడైంది. ఈ విషయంలో టర్కీ చాలా ముందంజలో ఉంది. అక్కడి ఉద్యోగుల్లో 78% మంది తమ వర్క్ స్టైల్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తరవాతి స్థానం భారత్‌దే. ఇండియాలో దాదాపు 76% మంది ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా బాగున్నారని ఈ సర్వేలో తేలింది. ఆ తరవాత చైనాలో 75% మంది ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నట్టు నిర్ధరించింది. గ్లోబల్ యావరేజ్ (Global Survey Of Employees) 57%. భారత్‌లో అంత కన్నా ఎక్కువే ఉంది.
జపాన్‌లో సమస్య ఇది..
నిజానికి జపాన్‌లో జాబ్ సెక్యూరిటీ చాలా ఎక్కువ. కానీ...ఓ కంపెనీ నుంచి మరో కంపెనీకి మారాలనుకుంటున్న వారికి మాత్రం అంత త్వరగా అవకాశాలు రావడం లేదు. ఓ కంపెనీ నచ్చకపోతే వెంటనే మరో కంపెనీకి వెళ్లిపోవడం సాధ్యపడడం లేదు. ఇది వాళ్లను ఒత్తిడికి గురి చేస్తోందన్న ఈ రిపోర్ట్ సారాంశం. ఇప్పటి వరకూ ఎన్నో అంతర్జాతీయ సంస్థల ఇలాంటి అధ్యయనాలు చేపట్టాయి. అన్నిట్లోనూ జపాన్ ర్యాంక్ చివర్లోనే ఉంది. జపాన్‌లో ఫుల్‌టైమ్ ఎంప్లాయ్‌మెంట్‌పై ఆసక్తి లేని వాళ్లు చాలా మంది షార్ట్ టర్మ్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ తరవాత మానేస్తున్నారు. ఇది మొత్తంగా కంపెనీపై ప్రభావం చూపిస్తోంది. అయితే..వర్క్ ప్లేస్‌లో పాజిటివ్‌గా ఉండే వాళ్ల మానసిక ఆరోగ్యంగా ఉంటున్నట్టు McKinsey Health Institute సర్వే స్పష్టం చేసింది. అంతే కాదు. వాళ్లలో క్రియేటివిటీ కూడా ఎక్కువగా ఉంటోందని వెల్లడించింది. ఇక అంతర్జాతీయంగా చూస్తే చాలా మంది ఉద్యోగులు ఎక్కువ సమయం పనిలోనే గడిపేస్తున్నారు.
International Labour Organization (ILO) ఓ ఆసక్తికర రిపోర్ట్‌ని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా కష్టపడి చేసే వాళ్లలో ఇండియన్సే ఎక్కువగా ఉన్నారని తేల్చి చెప్పింది. 2023 లెక్కల ప్రకారం..అంతర్జాతీయంగా భారతీయులు వారానికి 47.7 గంటలు పని చేస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. యావరేజ్ వర్క్‌వీక్ విషయంలో భారత్ ముందంజలో ఉందని తెలిపింది. ఈ విషయంలో ఖతార్, కాంగో, లెసోతో, భూటాన్, గాంబియా, యూఏఈ కూడా ముందంజలోనే ఉన్నాయి. కేవలం వర్కింగ్ అవర్స్‌పైనే రీసెర్చ్ చేసి ఈ రిపోర్ట్‌ని విడుదల చేసింది ILO.
Also Read: Shiv Nadar: ఈయన కలియుగ కర్ణుడు, రోజుకు 5.6 కోట్ల రూపాయలు దానంగా ఇచ్చాడు