IRCTC : ట్రైన్‌లో ఫుడ్ నచ్చట్లేదా జోమాటోలో ఆర్డర్ ఇచ్చేయండి - అందుబాటులోకి కొత్త సర్వీస్
Zomato : లాంగ్ జర్నీ చేసే ప్రయాణికులకు సీటు వద్దే ఫుడ్ డెలివరీ చేస్తోంది జొమాటో. ఈ సర్వీసు వేగంగా కీలక నగరాలకు విస్తరిస్తున్నారు.
IRCTC joins hands with Zomato to deliver food directly on train : లాంగ్ జర్నీ చేయాలంటే ఎక్కువ మంది రైళ్లకే ప్రాధాన్యం ఇస్తారు. ఇలాంటి ప్రయాణాల్లో ఆకలి దప్పులను తీర్చుకోవడం ప్యాసింజర్లకు పెద్ద కష్టం. ఎందుకంటే ట్రైన్‌లో అమ్మే ఆహార పదార్ధాలకు రుచీ పచీ ఉండదు. శుచి ఉంటుందో ఉండదో తెలియదు. అందుకే చాలా మంది కడుపు ఖాళీగా అయినా ఉంచుకుంటాం కానీ.. ట్రైన్ ఫుడ్ తినబోమని భీష్మించుకు కూర్చుంటారు. ఇలాంటి సమస్యలను ఐఆర్సీటీసీ గుర్తించింది. అందుకే జొమాటతో ఒప్పందం చేసుకుంది. రైలు ప్రమాణికులకు కావాల్సిన ఫుడ్.. సీటు దగ్గరకే డెలివరీ చేసేలా.. ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు జొమాటో ఆ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇప్పటికే పది లక్షల ఆర్డర్లను డెలివరీ చేసింది కూడా.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వంద రైల్వే స్టేషన్లలో జొమాటో ఈ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. మంచి స్పందన వచ్చిందని జొమాటో చెబుతోంది. ఇప్పటికే పది లక్షల ఆర్డర్లను డెలివరీ చేశామని జొమాటో ఘనంగా ప్రకటించుకుంది. మొత్తంగా 88 నగరాల్లో ఇష్టమైన ఆహారాన్ని రైల్వే స్టేషన్లలోని సీటు వద్దకే ఆఫర్ చేసే అవకాశం కల్పించింది. మామూలుగా అయితే కదిలే వాహనానికి డెలివరీ చేయడం అసాధ్యం. కానీ జొమాటో.. ముందుగానే రైళ్లు వచ్చే సమయాని కంటే ఆర్డర్లు తీసుకని రైలు వచ్చిన తర్వాత సీటు వద్దకే డెలివరీ చేసేలా ప్రోగ్రామ్ రూపొదించుకుంది. ఇందు కోసం ప్రత్యేక డెలివరీ బాయ్స్ ను కూడా రిక్రూట్ చేసుకుంది. కొంత మంది ఆయా రాష్ట్రాల మీదుగా ప్రయాణిచేటప్పుడు అక్కడి స్పెషల్ ఫుడ్ ను టేస్ట్ చేయాలనుకుంటారు. కానీ రైలు దిగలేరు. ఇలాంటి వారికి.. జొమాటోలో తాము రాబోయే స్టేషన్ లో ఎలాంటి ఫుడ్ తినాలనుకంటున్నామో ఆర్డర్ ఇస్తే చాలు.
ఈ సర్వీస్ ప్రయాణిస్తున్న వారికే కాదు.. వెయిటింగ్ చేస్తున్న వారికీ ఉపయోగపడుతుంది. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న వారు కూడా ఆర్డర్ చేసి ఫేవరేట్ పుడ్ తెప్పించుకోవచ్చు. ఈ విషయాన్ని జొమాటో సీఈవో .. సోషల్ మీడియాలో పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఐఆర్‌సీటీసీతో చేసుకున్న ఒప్పందం వల్ల ఇప్పటికే పది లక్షలకుపైగా ఆర్డర్స్ డెలివరీ చేశామన్నారు. ఇంతటితో ఆగిపోమని.. సమాజంలోని అన్ని వర్గాలకూ తమ సేవలు అందేలా వినూత్న ప్రయత్నాల చేస్తామని చెబుతున్నారు.
Update: @zomato now delivers food directly to your train coach at over 100 railway stations, thanks to our partnership with @IRCTCofficial. We’ve already served 10 lakh orders on trains. Try it on your next journey! pic.twitter.com/gyvawgfLSZ
— Deepinder Goyal (@deepigoyal) September 13, 2024
రైల్వే ప్రయాణికుల నుంచి వచ్చే ప్రధానఫిర్యాదు అయిన ఆహార పదార్థాల విషయంలో.. ప్రయాణికుల్ని మెప్పించడానికి జోమాటోతో ఐఆర్సీటీసీ గత ఏడాది ఒప్పందం చేసుకుంది. మొదట ఉత్తరాదిలోని కొ్న్ని స్టేషన్లలో ప్రయోగాత్మకంగా పరిశీలన చేసింది. తర్వాత వంద స్టేషన్లకు విస్తరించింది. ప్రయాణికుల నంచి కస్టమర్ల నుంచి మంచి స్పందన ఉండటంతో.. త్వరలో ఈ సర్వీసును అన్నిప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లకు విస్తరించే యోచనలో జొమాటో ఉంది. అయితే ఇంకా హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి వంటి స్టేషన్లకు ఈ జొమాటో సేవలు రాలేదు.