IPL 2024 Auction Live Updates: ముగిసిన ఐపీఎల్ మినీ వేలం, 72 మంది ఆటగాళ్లు వెరీ లక్కీ
IPL 2024 Auction Live Updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం ప్లేయర్ల వేలానికి సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
LIVE
Background
IPL 2014 Auction: మినీ వేలంలో అమ్ముడైన 72 మంది ఆటగాళ్లు
మంగళవారం నిర్వహించిన IPL 2024 మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 72 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అత్యంత ఖరీదైనదిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్ రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 20.50 కోట్లకు కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా హర్షల్ పటేల్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. యూపీ తరఫున ఆడిన సమీర్ రిజ్వీ అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్. సమీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 8.40 కోట్లకు కొనుగోలు చేసింది.
మహ్మద్ నబీని ముంబై, షాయ్ హోప్‌ను ఢిల్లీ కొనుగోలు
వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్ కూడా చివరి రౌండ్‌లో సోల్డ్ అయ్యాడు. హోప్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా, ముంబై ఇండియన్స్ ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీని రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది.
2 కోట్లకు ముజీబ్ ఉర్ రెహ్మాన్
ఆఫ్ఘనిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ చివరి రౌండ్‌లో రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన అర్షద్ ఖాన్ ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
IPL 2024 Auction LIVE: 8 కోట్లకు రిలే రోసోను పంజాబ్ కొనుగోలు చేసింది
ఆఖరి రౌండ్ వేలంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రిలే రోసోను పంజాబ్ కింగ్స్ రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ ఆటగాడిని తీసుకునేందుకు వేలంలో పాల్గొంది. కానీ చివరికి పంజాబ్ రోసోను దక్కించుకుంది.
నువాన్ తుషారకు ముంబై ఇండియన్స్ రూ.4.80 కోట్లు
శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషారాపై ముంబై ఇండియన్స్ భారీ బిడ్డింగ్ వేసింది. రూ.50 లక్షల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన ఈ ఆటగాడిని రూ.4.80 కోట్ల భారీ మొత్తానికి ముంబై కొనుగోలు చేసింది. ముంబై అన్‌క్యాప్డ్ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌ను కూడా రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.