News
News
X

IndiGo Flight: ఫ్లైట్‌లో రక్తం కక్కుకున్న ప్రయాణికుడు, అత్యవసర ల్యాండింగ్ - ప్రాణాలు దక్కలేదు

IndiGo Flight: ఇండిగో ఫ్లైట్‌లో ఓ వ్యక్తి రక్తం కక్కుకుని మరణించాడు.

FOLLOW US: 
Share:

IndiGo Flight:

ఇండిగో ఫ్లైట్‌లో ఘటన..

మదురై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌లో ఓ 60 ఏళ్ల వ్యక్తి ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. నోట్లో నుంచి రక్తం రావడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. పరిస్థితి విషమించడం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇండోర్‌లోని దేవి అహిల్యాబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ల్యాండ్ అయిన క్షణాల్లోనే ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా
పోయింది. అప్పటికే ఆ వ్యక్తి చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు. ఎయిర్‌పోర్ట్ నుంచి హుటాహుటిన ఆంబులెన్స్‌లో తరలించారు. అంత వేగంగా స్పందించినా ప్రాణాలు దక్కలేదు. ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ ప్రబోధ్ చంద్రశర్మ ఇదే విషయాన్ని వెల్లడించారు. "అతుల్ గుప్త అనే ప్రయాణికుడు ప్రయాణం మధ్యలో ఉన్నట్టుండి నోట్లో నుంచి రక్తం కక్కుకున్నాడు. మేం తక్షణమే స్పందించి అత్యవసర ల్యాండింగ్ చేశాం. పేషెంట్ ప్రాణాలు మాత్రం దక్కలేదు" అని తెలిపారు. అయితే..ప్రాథమిక విచారణలో తేలిందేంటంటే...ఫ్లైట్‌ ఎక్కక ముందే అతుల్ గుప్త అనారోగ్యానికి గురయ్యాడు. గుండె జబ్బుతో పాటు హైబీపీ, షుగర్ ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. మృతుడు నోయిడాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం చేసిన తరవాత కుటుంబ సభ్యులకు డెడ్‌బాడీని అప్పగిస్తామని స్పష్టం చేశారు. 

ఫ్లైట్‌లలో ఫైట్‌లు..

గతంలో పల్లె వెలుగు బస్సుల్లో సీట్ల కోసం కొట్టుకున్నట్లుగానే విమానాల్లో కూడా కొట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు మనం తరచుగా చూస్తున్నాం. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఎయిర్ ఇండియా న్యూయార్క్- ఢిల్లీ విమానంలో వృద్ధ మహిళా ప్రయాణీకురాలి సీటుపై మూత్రం పోశాడో వ్యక్తి. దీనిపై కేసు నమోదైంది. ఆ మూత్రం పోసిన వ్యక్తి అరెస్టు కూడా అయ్యాడు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు గొడవ పడిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ముందుగా గొడవ పడ్డ యువకుడు ఆ తర్వాత తన 
ఒంటిపైనున్న చొక్కాను విప్పి మరీ తోటి ప్రయాణికుడిపై గుద్దుల వర్షం కురిపించాడు. అయితే విమానంలో జరిగిన వాగ్వాదాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బంగ్లాదేశ్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ గొడవ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఇద్దరూ గొడవ పడుతుండటం మనం చూడవచ్చు. ట్విట్టర్ యూజర్ బిటాంకో బిస్వాస్ షేర్ చేసిన వీడియో ప్రకారం, బంగ్లాదేశ్ జాతీయ క్యారియర్ అయిన బిమాన్ బంగ్లాదేశ్ విమానంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చొక్కా విప్పేసిన ఓ ప్రయాణీకుడు విమానం ముందు వరుసలో కూర్చున్న మరో ప్రయాణికుడితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఏడుస్తూనే అతడిపై దాడి చేశాడు. వాదన సమయంలో.. ఆ వ్యక్తి తన సహ-ప్రయాణికుడి కాలర్‌ను పట్టుకుని కనిపించాడు. అతని ముఖం వీడియోలో స్పష్టంగా కనిపించడం లేదు. కానీ చొక్కాలేని వ్యక్తి అతడి చెంపపై కొట్టాడు. దీంతో గొడవ మరింత పెరిగింది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు. 

Published at : 15 Jan 2023 10:40 AM (IST) Tags: Indigo flight Passenger Bleeding from Mouth

సంబంధిత కథనాలు

Union Budget Live 2023 Updates: సీతమ్మ బడ్జెట్ మురిపిస్తుందా? ఉసురుమనిపిస్తుందా?

Union Budget Live 2023 Updates: సీతమ్మ బడ్జెట్ మురిపిస్తుందా? ఉసురుమనిపిస్తుందా?

Petrol-Diesel Price 01 February 2023: తెలుగు నగరాల్లో తగ్గిన చమురు ధరలు, మీ ప్రాంతంలో ఇవాళ్టి రేటు ఇది

Petrol-Diesel Price 01 February 2023: తెలుగు నగరాల్లో తగ్గిన చమురు ధరలు, మీ ప్రాంతంలో ఇవాళ్టి రేటు ఇది

Gold-Silver Price 01 February 2023: బడ్జెట్‌ ఎఫెక్ట్‌ - తగ్గిన పసిడి, వెండి రేటు

Gold-Silver Price 01 February 2023: బడ్జెట్‌ ఎఫెక్ట్‌ - తగ్గిన పసిడి, వెండి రేటు

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

టాప్ స్టోరీస్

Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

Etala Vs Kousik Reddy :  ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ -  పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి