News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Lottery: నెలకు రూ.5.5 లక్షలు- 25 ఏళ్లు ఇవ్వనున్న లాటరీ సంస్థ- ఇది మామూలు అదృష్టం కాదు

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ‘ఫాస్ట్‌ 5’ పేరిట నిర్వహించిన లాటరీలో మెగా ప్రైజ్‌ మనీ విజేతగా నిలిచాడు.

FOLLOW US: 
Share:

ప్రతి మనిషికి గురివిందంతైనా అదృష్టం ఉంటుంది అంటారు పెద్దలు. జీవితంలో ఏదైనా అనుకోని మంచి జరిగితే పెద్దలు చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది. అదే ఏ లాటరీలో పెద్ద మొత్తంలో డబ్బు వస్తే వీడికి ఎక్కడో పెద్ద మచ్చ ఉంది అనడం వింటూనే ఉంటాం. అదే జీవితంలో ఎలాంటి పని చేయకుండా నెలకు అక్షరాల రూ.5.5 లక్షలు వస్తే వారిని ఏమనాలి. అది కూడా నెలా, రెండు నెలలు కాదు.. ఏకంగా 25 సంత్సరాలు వస్తే ఆ ఊహ ఎంత బాగుంటుందో కదా. ఇలాంటి లక్కీఛాన్స్ తగిలితే ఒక కుటుంబం ఒక తరం ప్రశాంతంగా తిని కూర్చున్నా తరగనంత సొమ్ము వస్తే వాళ్ల ఆనందానికి హద్దులు ఉండవు.

ఇలాంటి అదృష్టమే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని వరించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ‘ఫాస్ట్‌ 5’ పేరిట నిర్వహించిన లాటరీలో ఉత్తరప్రదేశ్‌ వాసి ఈ మెగా ప్రైజ్‌ మనీ విజేతగా నిలిచాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆవివరాలు ఏంటో చదివేసేయండి.. ఉత్తరప్రదేశ్ చెందిన మొహమ్మద్‌ ఆదిల్‌ ఖాన్‌ దుబాయ్‌లోని ఒక రియల్‌ఎస్టేట్‌ సంస్థలో ఇంటీరియర్‌ డిజైన్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి లాటరీ టికెట్లు కొనడం అలవాటు. ఇటీవల యూఏఈ ‘ఫాస్ట్‌ 5’ పేరిట లాటరీ ప్రకటించింది. అందులో ఆదిల్ ఖాన్ ఓ టికెట్ కొనుగోలు చేశాడు. అంతే అదృష్టం వరించింది. ఆ మెగా ప్రైజ్‌ మనీ డ్రాలో మొదటి విజేతగా నిలిచాడు. గురువారం నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. విజేతకు నెలకు 25,000 దిర్హమ్‌లు (భారత కరెన్నీలో రూ.5,59,822) చొప్పున 25 ఏళ్లపాటు ఇవ్వనున్నారు.

విజేతగా నిలవడంపై ఆదిల్‌ ఖాన్‌ ఆనందం వ్యక్తం చేశాడు. డ్రాలో విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. తన కుటుంబానికి తానే ఏకైక జీవనాధారమని కన్నీళ్లతో చెప్పాడు. కరోనా విజృంభన సమయంలో తన సోదరుడు చనిపోయాడని, అతడి కుటుంబాన్నీ తానే పోషిస్తున్నట్లు వివరించాడు. తనకు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఐదేళ్ల పాప ఉందని, ఇలాంటి సమయంలో లాటరీ తగలడం తన అదృష్టమన్నాడు. తాను లాటరీ గెలిచానని ఇంట్లో చెప్పినప్పుడు తన కుటుంబం తొలుత నమ్మలేదన్నాడు. ఆ వార్త నిజమో లేదో తెలుసుకోవడానికి ఒకటికి రెండుసార్లు సరిచూసుకోమని చెప్పారని అన్నారు. ఇప్పటికీ లాటరీ తగిలిన విషయం ఒక కలలా ఉందని, ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానని ఆనందం వ్యక్తం చేశాడు.

ఎమిరైట్స్‌ లాటరీ నిర్వహణ సంస్థ టైచెరస్‌ మార్కెటింగ్‌ హెడ్‌ మాట్లాడుతూ..‘ఫాస్ట్‌ 5’ లక్కీడ్రాను ప్రారంభించిన 8 వారాలలోపే తొలి విజేతను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. స్వల్ప సమయంలోనే ఓ వ్యక్తి మల్టీ మిలియనీర్‌ కావడానికి తాము ‘ఫాస్ట్‌ 5’ను తీసుకొచ్చామని. విజేత ప్రయోజనాలను ఆశించి సొమ్ము మొత్తం ఒకేసారి కాకుండా నెలకోసారి ఇచ్చే ఆలోచన చేశామన్నారు. ఆదిల్ ఖాన్ లాటరీ గెలవడం సంతోషంగా ఉందన్నారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 29 Jul 2023 11:00 AM (IST) Tags: Indian UP man Lucky draw Mohamned Adil Khan UAE Lottery

ఇవి కూడా చూడండి

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Andhra News: సీఈవోకు చంద్రబాబు లేఖ - ఓట్ల అవకతవకలపై చర్యలు తీసుకోవాలని వినతి

Andhra News: సీఈవోకు చంద్రబాబు లేఖ - ఓట్ల అవకతవకలపై చర్యలు తీసుకోవాలని వినతి

Revanth Reddy Tweet: 'అంతకు మించిన తృప్తి ఏముంటుంది.?' - ప్రజాదర్బార్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

Revanth Reddy Tweet: 'అంతకు మించిన తృప్తి ఏముంటుంది.?' - ప్రజాదర్బార్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

APPSC Group-1:  ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

టాప్ స్టోరీస్

ప్రజాభవన్‌ వద్ద కేసీఆర్‌ పేరుపై మట్టిపూత- సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు - వద్దని వారించిన బండ్ల గణేష్

ప్రజాభవన్‌ వద్ద కేసీఆర్‌ పేరుపై మట్టిపూత- సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు - వద్దని వారించిన బండ్ల గణేష్

Chandrababu on Telangana Election Results: 'అహంకార ఫలితం తెలంగాణలో చూశాం' - ఏపీలోనూ అదే రిపీట్ అవుతుందంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu on Telangana Election Results: 'అహంకార ఫలితం తెలంగాణలో చూశాం' - ఏపీలోనూ అదే రిపీట్ అవుతుందంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Bharat Ki Baat Year Ender 2023 : అద్వితీయంగా జీ20 నిర్వహణ - 2023లో మరింత పెరిగిన భారత్ ప్రతిష్ట

Bharat Ki Baat Year Ender 2023 : అద్వితీయంగా జీ20 నిర్వహణ - 2023లో మరింత పెరిగిన భారత్ ప్రతిష్ట

CM Revanth On KCR Health: కేసీఆర్‌ హెల్త్‌ బులెటిన్‌ విడుదల-ఆరోగ్యంపై సీఎం రేవంత్‌ ఆరా

CM Revanth On KCR Health: కేసీఆర్‌ హెల్త్‌ బులెటిన్‌ విడుదల-ఆరోగ్యంపై సీఎం రేవంత్‌ ఆరా