CDS Bipin Rawat Chopper Crash: నేడు ఢిల్లీకి రావత్ దంపతుల భౌతిక కాయాలు.. శుక్రవారం అంత్యక్రియలు
తమిళనాడు ఊటీ సమీపంలో ఓ సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ చాపర్‌లో సీడీఎస్ బిపిన్ రావత్ ఉన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

Background
తమిళనాడు కూనూర్‌లో ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన సిబ్బంది, కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం.
Army helicopter carrying senior Defence officials crashes at Coonoor in Nilgiris district in TN: Official sources
— Press Trust of India (@PTI_News) December 8, 2021
ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సూలూర్ వైమానిక స్థావరం నుంచి వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీకి(డీఎస్సీ) వెళ్తుండగా కూనూర్ సమీపంలో ఈ హెలికాప్టర్ కుప్పకూలింది. నీలగిరి జిల్లాలోని కొండ ప్రాంతాల్లో శిథిలాలు పడిపోయాయి.
#BREAKING | நீலகிரி மாவட்டம் குன்னூர் அருகே காட்டேரி பகுதியில் ராணுவ ஹெலிகாப்டர் விழுந்து விபத்து
— ABP Nadu (@abpnadu) December 8, 2021
விபத்துகுள்ளான ஹெலிகாப்டரில் மூத்த அதிகாரிகள் இருந்ததாக தகவல்https://t.co/wupaoCQKa2 | #Nilagiri | #Accident | #helicopter pic.twitter.com/gOu3qQOLvC
సమాచారం అందిన వెంటనే ఆర్మీ, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య, డిఫెన్స్ అసిస్టెంట్, సెక్యూరిటీ కమాండోలు, ఐఏఎఫ్ పైలట్లు.. మొత్తం 14 మంది చాపర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
#WATCH | Latest visuals from the spot (between Coimbatore and Sulur) where a military chopper crashed in Tamil Nadu. CDS Gen Bipin Rawat, his staff and some family members were in the chopper.
— ANI (@ANI) December 8, 2021
(Video Source: Locals involved in search and rescue operation) pic.twitter.com/YkBVlzsk1J
ఘటన సమాచారం అందుకున్న స్థానిక మిలిటరీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 80 శాతానికి పైగా కాలిన 2 బాడీలను ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
ప్రమాదానికి గురైన Mi-17V5 హెలికాప్టర్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్- ఉన్నట్లు భారత వాయుసేన ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించింది.
గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావత్, ఆయన సతీమణి మృతదేహాలను గురువారం ఢిల్లీ తీసుకురానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలకు అంతిమ నివాళులర్పించేందుకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. అంత్యక్రియల ఊరేగింపు కామరాజ్ మార్గ్ నుండి ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రంలోగా వారి పార్థివ దేహాన్ని సైనిక విమానంలో దేశ రాజధానికి తీసుకు వచ్చే అవకాశం ఉంది.
దేశ సైనిక సంపదను ఆధునీకరించడంలో రావత్ పాత్ర చాలా గొప్పది: ప్రధాని
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సాయుధ దళాల సిబ్బందిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. వాళ్లంతా దేశానికి అత్యంత శ్రద్ధతో సేవ చేశారని గుర్తు చేశారు.
I am deeply anguished by the helicopter crash in Tamil Nadu in which we have lost Gen Bipin Rawat, his wife and other personnel of the Armed Forces. They served India with utmost diligence. My thoughts are with the bereaved families.
— Narendra Modi (@narendramodi) December 8, 2021
జనరల్ బిపిన్ రావత్ నిబద్దత కలిగిన సైనికుడని... నిజమైన దేశభక్తుడని అన్నారు ప్రధాని. దేశ సాయుధ దళాలను, భద్రతా యంత్రాంగాన్ని ఆధునీకరించడంలో ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. వ్యూహాత్మక విషయాలపై అతనికి చాలా పట్టుందని అలాంటి వ్యక్తి మృతి తీవ్రంగా కలచివేసిందన్నారు మోదీ.
Gen Bipin Rawat was an outstanding soldier. A true patriot, he greatly contributed to modernising our armed forces and security apparatus. His insights and perspectives on strategic matters were exceptional. His passing away has saddened me deeply. Om Shanti. pic.twitter.com/YOuQvFT7Et
— Narendra Modi (@narendramodi) December 8, 2021





















