Cheetah Helicopter Crash: అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం, కుప్ప కూలిన ఆర్మీ చీతా హెలికాప్టర్
Cheetah Helicopter Crash: అరుణాచల్ ప్రదేశ్‌లో ఇండియన్ ఆర్మీ చీతా హెలికాప్టర్ కుప్ప కూలింది.
Cheetah Helicopter Crash:
అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండియన్ ఆర్మీ చీతా హెలికాప్టర్ మండాలా హిల్స్ వద్ద కుప్ప కూలింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పైలట్‌ల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. గువాహటి డిఫెన్స్ పీఆర్‌వో, కల్నల్ మహేంద్ర రావత్ ఈ ఘటనపై స్పందించారు.
"అరుణాచల్ ప్రదేశ్‌లోని బొండిలాలో చీతా హెలికాప్టర్‌కు, ATCకి మధ్య కాంటాక్ట్ కట్ అయింది. ఉదయం 9.15 గంటలకే కాంటాక్ట్ కోల్పోయాం. మండాలా హిల్స్ వద్ద క్రాష్ అయినట్టు సమాచారం అందింది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం"
- కల్నల్ మహేంద్ర రావత్
Indian Army Cheetah helicopter has crashed near Mandala hills area of Arunachal Pradesh. Search operation for the pilots has started. More details awaited: Army sources pic.twitter.com/fqD0uu767w
— ANI (@ANI) March 16, 2023