Himachal Rains : వరదలకు హిమాచల్ ప్రదేశ్ అల్లకల్లోలం - బీభత్సంగా వరదల వీడియోలు !
హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వంతెనలు, ఇళ్లు, కార్లు కొట్టుకుపోతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Himachal Rains : హిమాచల్ ప్రదేశ్ అన్ని ప్రధాన నదులు పొంగిపొర్లుతున్నాయి. పరిస్థితి దారుణంగా ఉంది. హిమాలయాల్లో ఉన్న నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. మనాలి వద్ద ఉన్న బియాస్ నది ఉప్పొంగుతోంది. వేగంగా ప్రవహిస్తున్న ఆ నది ధాటికి.. టూరిస్టులకు చెందిన కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి. మనాలిలో బియాస్ నది సమీపంలో పార్క్ చేసిన కార్లన్నీ ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నీరు, బురద ఒక్కసారిగా కొట్టుకురావడంతో.. కార్లు కూడా ఆ బురద నీటిలోనే మాయం అయ్యాయి. వర్షాలు.. వరదలు.. కొండచరియలు విరిగిపడడం వల్ల.. హిమాచల్‌లో ఇప్పటికే 19 మంది మృతిచెందారు.
#WATCH | Himachal Pradesh: Mandi's Panchvaktra temple has been submerged in water due to a spate in the Beas river following incessant heavy rainfall. pic.twitter.com/sk7wjpbnah
— ANI (@ANI) July 10, 2023
[ హిమాచల్ ప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో అక్కడ వర్షం కురుస్తోంది. ఆకస్మిక వరదల వల్ల భారీ స్థాయిలో నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో ఇండ్లు కూడా కొట్టుకుపోయాయి. రోడ్లు, బ్రిడ్జ్‌లు ధ్వంసం అయ్యాయి. పలు చోట్ల క్లౌడ్‌బస్ట్ కావడంతో.. కొండచరియలు విరిగిపడుతున్నాయి. హిమాచల్‌లో 828 రోడ్లను, మూడు జాతీయ హైవేలను మూసివేశారు.
Visuals of a flash flood hitting Thunag area of Himachal Pradesh's Mandi district.
— Press Trust of India (@PTI_News) July 10, 2023
Amid incessant rainfall lashing the hill state, Solan received 135 mm of rain on Sunday, breaking a 50-year-old record of 105 mm of rain in a day in 1971, while Una received the highest rainfall… pic.twitter.com/Tl1iM6poVc
హిమాచల్ ప్రదేశ్ లో బియాస్ నదిపై ఉన్న వంతెనలు కొట్టుకుపోతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ ఇనుప వంతెన కూలి, వరద నీటిలో పడి కొట్టుకుపోయిన దృశ్యాలను ఓ యూట్యూబర్ రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అలాగే బియాస్ నది వరదలతో తీరం కోతకు గురై, నది ఒడ్డున నిర్మించిన పలు ఇళ్లు కొట్టుకుపోయాయి.
Big Scale Damage in Himachal Pradesh 🙏🏻🙏🏻
— Weatherman Shubham (@shubhamtorres09) July 10, 2023
Live Visuals from Parwanoo
10th July 2023
Solan , Himachal Pradesh pic.twitter.com/5zTAzo8K2w
మనాలిలో ఫ్లాష్ ప్లడ్స్ కారణంగా పలు దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. కులూ, కిన్నౌర్, ఛంబ ప్రాంతాలలో పొలాలు నీట మునిగాయి. కులూలో వరదలకు జాతీయ రహదారి కొంత భాగం కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చండీగఢ్-మనాలి జాతీయ రహదారితో పాటు హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 765 రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Thunderstorms and landslides rock North India. Red alert issued in seven districts of Himachal Pradesh due to heavy rains; 14 lost their lives in rain-related incidents. All hands on deck.
— Megh Updates 🚨™ (@MeghUpdates) July 10, 2023
Prayers for safety of people🙏 #PanchvaktrMahadev, Mandi!! , #Parwanoo , Chamera Lake… pic.twitter.com/fxHEnaDmdQ
Situation at Chamera Lake Chamba Himachal Pradesh pic.twitter.com/2NrzfQXvH1
— Go Himachal (@GoHimachal_) July 10, 2023
Many houses and bridges were flooded away, but the Panchvaktra temple in Mandi District, Himachal Pradesh still stands there. Har Har Mahadev 🙏🚩 #HimachalFloods #Heavyrainfall pic.twitter.com/8ksMHrsRa4
— ɅMɅN DUВΞY 🇮🇳 (@imAmanDubey) July 10, 2023