అన్వేషించండి

Aircraft Mayday Calls: విమానంలో పైలట్ ‘మే డే’ అని ఎందుకు అంటాడు? దీనివల్ల ఎంత నష్టం ఆపొచ్చో తెలుసా?

రన్ వే-34 సినిమా చూసి ఉంటారు. ఆ సినిమాలో హీరో అజయ్ దేవగన్.. మే డే అనౌన్స్ చేసి ఫ్లైయిట్ లాండింగ్ కు ప్రయత్నించడం చూసి ఉంటాం. అసలు మే డే ఏంటి? దానికి ఏవియేషన్ కు ఏంటి సంబంధం?

మే డే.. అంటే.. కార్మిక దినోత్సవం మాత్రమే కాదు. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో మనం చూశాం. విమానాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పైలట్లు.. చెప్పిన పదం.. మే డే..!  అసలు ఏంటి మే.. డే అంటే.. ఎందుకు వాడతారు?

మనలో చాలామంది ఓటీటీ లో రన్ వే-34 సినిమా చూసి ఉంటారు. ఆ సినిమాలో హీరో అజయ్ దేవగన్.. మే డే అనౌన్స్ చేసి.. విపత్కర పరిస్థితుల్లో ఫ్లైయిట్ లాండింగ్ కు ప్రయత్నించడం చూసి ఉంటాం. అంతకు ముందు ఏడాది సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా లో కూడా ఇలాంటి ప్రస్తావన ఉంది. అసలు మే డే ఏంటి? దానికి ఏవియేషన్ కు ఏంటి సంబంధం?

ఏంటీ ఈ మే డే కాల్?
విమాన ప్రయాణం అనేది కొన్ని సందర్భాల్లో రిస్కుతో కూడుకున్నది. వాతావరణం ప్రతికూలంగా మారినా.. లేక ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినా వేల అడుగుల ఎత్తులో ఎగిరే విమానం ప్రమాదంలో ఉన్నట్లే. అలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా విమానం.. ల్యాండ్ అవ్వాల్సిన ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ అవ్వకుండా ప్రత్యామ్నాయ విమానాశ్రయానికి మళ్లిస్తారు.  ఒక్కోసారి విమానంలో ఇంధనం అయిపోతుంటే.. దగ్గరలోని విమానాశ్రయంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నాల్లో ప్రమాదాలు ఎదురు కావొచ్చు. మే డే అనేది విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం.. అని తెలిపే సమాచారం. అది కూడా ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్నాం అని చెప్పే అత్యవసర మెసేజ్ అది. విమానయానంలో ఎక్కువగా వాడినా.. అది కేవలం విమానాలకు మాత్రమే ఉద్దేశించింది కాదు. నౌకల్లో కూడా ఇదే విధానాన్ని పాటిస్తారు. మే డే అని మూడుసార్లు వరసుగా పలికిన తర్వాత తాము ఉన్న పరిస్థితిని వివరిస్తారు. అప్పుడు వారికి గ్రౌండ్ నుంచి అవసరం అయిన సమాచారం సాయం అందుతుంది. 

మే డే చెప్పే విధానం ఇదీ..
మే డే అని చెప్పడానికి.. ఓ నిర్థిష్టమైన విధానం ఉంది. అన్ని సందర్భాల్లో మే డే చెప్పడానికి వీలులేదు. తీవ్ర అపాయం, ప్రాణాంతకం అయిన సందర్భాల్లో మాత్రమే దీనిని వాడాల్సి ఉంటుంది. మే-డే అని మూడుసార్లు పైలట్ గట్టిగా పలకాల్సి ఉంటుంది. ఎందుకంటే... అతను నిజంగా మే డే ప్రకటిస్తున్నాడా.. లేక మే డే గురించి చెప్పాలనుకుంటున్నాడా.. అన్నది తెలీదు. అలాగే పైలట్లుగా వివిధ దేశాల వ్యక్తులు ఉంటారు. వారు పలికే విధానం కూడా అందరికీ అర్థం కాకపోవచ్చు. అందుకని మూడుసార్లు గట్టిగా అనౌన్స్ చెసి ఆ తర్వాత పరిస్థితిని వివరించాలి. ఈ క్రమం ఏంటంటే.. 

మే డే.. మే డే.. మే డే.. 
ఏ స్షేషన్ కు వెళ్లాలనుకుంటున్నారో దానిని పిలవడం
విమానం.. నెంబర్ 
అక్కడున్న అత్యవసర పరిస్థితి 
వాతావరణ సమాచారం
పైలట్ ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పే వివరం 
విమానం ఎగురుతున్న ఎత్తు
ఇంధనం ఎంత సేపు వస్తుందన్న వివరాలు 
ప్రయాణికుల సంఖ్య 
ఇలాంటి వివరాలు వరుసగా అందించాలి. 
అప్పుడు.. గ్రౌండ్ లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC నుంచి వారికి అవసరమైన సాయం అందుతుంది. విమానం దిగేందుకు రన్ వే  వెంటనే సిద్ధం చేయడం.. మిగిలిన కార్యకలాపాలు నిలిపేసి.. ఈ విమానాన్ని సురక్షితంగా దించేందుకు మొత్తం యంత్రాంగం అంతా ప్రయత్నిస్తుంది. అనుకోనిది ఏదైనా జరిగితే.. సహాయకార్యక్రమాలకు కూడా సిద్ధం అవుతుంది. 

ఇది ఎలా వచ్చింది...?
మే డే ను మొట్టమొదటిగా ఉపయోగించిన వ్యక్తి లండన్ ఎయిర్ పోర్టులోని సీనియర్ అధికారి ఫ్రెడరిక్ స్టాన్లీ మెక్ ఫోర్డు. 1920లో ఆయన ఈ పదాన్ని సిఫారసు చేశాడు. ప్రమాద సమయంలో సంకేతంగా చెప్పడానికి అందరూ ఒకటే వాడేందుకు వీలుగా ఒక పదం సూచించమన్నప్పుడు.. ఫోర్డ్ మే డే ను సజెస్ట్ చేశాడు. ఇది ఫ్రెంచ్ పదం మెయిడర్ నుంచి తీసుకున్నారు. అంటే..  రక్షించండి..  అని అర్థం.  ఆ తర్వాత నుంచి విమానయానంలో ఇదో ముఖ్యమైన అంశంగా మారిపోయింది. చాలా సందర్భాల్లో పైలట్లు ఈ మే డే అని అనే పదాన్ని వాడారు. 2019 జూలైలో ముంబై నుంచి ఢిల్లీ వెళుతున్న విమానాన్ని కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దారిమళ్లించాల్సి వచ్చింది. విమానంలో ఇంధనం తక్కువుగా ఉండటంతో పైలట్ మే డే చెప్పి... లక్నో విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. కేవలం ఇక్కడే కాదు.. నౌకల్లో కూడా అపాయకర పరిస్థితుల్లో దీనినే వాడతారు. ఒకవేళ ఒక నౌక ద్వారా పంపిన రేడియో సిగ్నల్ సంబంధికులకు చేరుకోండా వేరే నౌకలకు చేరితే వారు దాన్ని అవసరమైన వారికి చేరుస్తారు. దీనిని "మే డే రిలే "  అని అంటారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget