అన్వేషించండి

Most Powerful Drones : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డ్రోన్లు ఏ దేశం దగ్గర ఉన్నాయి? వాటి ధర ఎంత?

Most Powerful Drones : నేటి యుద్ధాల్లో, డ్రోన్లు ఫైటర్ జెట్ల కంటే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన డ్రోన్ల గురించి తెలుసుకుందాం.

Most Powerful Drones : భారత్, పాకిస్తాన్ మధ్య జరిగి పోరాటంలో డ్రోన్లు అత్యంత శక్తిమంతమైన పాత్ర పోషించాయి. దీంతో వార్‌లో వీటి పాత్ర ఏ స్థాయిలో ఉందే అర్థమైంది. గతంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల మధ్య జరిగిన వార్‌లో కూడా డ్రోన్‌లను వాడుకున్నారు. ఇప్పుడు లెటెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఘర్షణే. 

ఎక్కడికీ కదలకుండా ప్రత్యర్థుల స్థావరాలను తెలుసుకోవడమే కాదు వాటిని ధ్వంసం చేయడంలో ఈ డ్రోన్లు చాలా ఉపయోగపడ్డాయి. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రస్థావరాలను, సైనిక పోస్టులను కొట్టడంలో భారత్ ఈ డ్రోన్ల సహాయంతో విజయవంతమైంది. పాకిస్తాన్ కూడా డ్రోన్ల సాయంతో దాడికి యత్నించినా మనకి ఉన్న డిఫెన్స్ సిస్టమ్‌ వాటిని పేల్చేసింది.   

ఈ సంఘర్షణలో డ్రోన్‌లు కీలక పాత్ర పోషించాయి. భారతదేశం డ్రోన్ల సహాయంతో పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థతోపాటు అనేక వైమానిక స్థావరాలు, ఇతర ప్రాంతాలను ధ్వంసం చేసింది. ఆధునిక యుద్ధాలలో డ్రోన్ల పాత్ర చాలా పెరిగిందని చెప్పడానికి ఇది చాలు. దీనికి ప్రధాన కారణం వీటి ఖర్చు తక్కువ, పైలట్ అవసరం లేదు.. ఇవి లక్ష్యాన్ని గుర్తించి దాడి చేయగలవు. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, శక్తివంతమైన డ్రోన్ ఏ దేశం వద్ద ఉందో తెలుసుకుందాం.

MQ-9 రీపర్

రక్షణ రంగంలో అమెరికా, రష్యా ఆయుధాలు అగ్రగామిగా నిలుస్తున్నాయి. అమెరికా వద్ద MQ-9 రీపర్ అనే డ్రోన్ ఉంది, దీనిని అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ సంస్థ తయారు చేసింది. ఇది చాలా ప్రమాదకరమైనది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన డ్రోన్, దీనిని శత్రువులను పర్యవేక్షించడానికి, వారి గూఢచర్యం చేయడానికి, వారిపై దాడి చేయడానికి ఉపయోగిస్తారు. MQ-9 రీపర్ ఎక్కువసేపు ఎత్తులో  ఎగరగలుగుతుంది. ఇది ఎగిరే టైంలో ఎలాంటి శబ్ధం ఉండదు. శత్రువులు గుర్తించేలోపు వారిని నాశనం చేయగలదు. మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, దీని పరిధి దాదాపు 1900 కిలోమీటర్లు, ఇది 50,000 అడుగుల ఎత్తులో ఎగరగలుగుతుంది .

MQ-9 రీపర్ ఎలా హ్యండిల్ చేస్తారు ?

MQ-9 రీపర్‌ను ఎక్కడైనా కూర్చుని, వీడియో గేమ్స్ లాగా సులభంగా నియంత్రించవచ్చు. దీన్ని నియంత్రించడానికి ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు అవసరం. ఈ డ్రోన్ మొదటిసారిగా 2001లో ఎగిరింది. దీని కచ్చితత్వం, విధ్వంసక శక్తిని అమెరికా అఫ్ఘానిస్తాన్, ఇరాక్, సిరియా వంటి యుద్ధ ప్రాంతాల‌్లో దీన్ని విస్తృతంగా ఉపయోగించారు. దీని నుంచి హెల్‌ఫైర్ క్షిపణులు, లేజర్ తో పని చేసే బాంబులు ప్రయోగించవచ్చు.  భారతదేశం కూడా అమెరికా నుంచి MQ-9 రీపర్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. నివేదికల ప్రకారం, రెండు దేశాల మధ్య దీనికి సంబంధించి దాదాపు 34,500 కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది.

ప్రస్తుతం భారత్‌లో ఉన్న డ్రోన్లు ఇవే:-
హెరాన్‌ UAV డ్రోన్‌ను ఇజ్రాయెల్ కంపెనీ తయారు చేసింది. సుదూరాలపై నిఘా ఉంచేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఇది 30వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. 40 గంటల పాటు పని చేస్తుంది. దీనికి నైట్‌ విజన్, లైవ్ వీడియో తీసే ఫెసిలిటీ కూడా ఉంది. ఎంకే -IIను కూడా ఇజ్రాయెల్ తయారు చేసింది. దీన్ని వ్యూహాత్మక నిఘా కోసం ఉంచుతారు. షార్ట్ రేంజ్‌, తక్కువ ఎత్తులో  పని చేస్తుంది. 18 గంటలు పని చేస్తుంది. 

భారత్ కూడా కొన్ని డ్రోన్లు తయారు చేసుకుంది. వాటిలో ముఖ్యమైంది. రుస్తుం UAV సిరీస్‌ డ్రోన్‌ను డీఆర్‌డీవో తయారు చేసింది. ఇది ప్రస్తతం ట్రయల్ రన్‌లో ఉంది. రెండోది స్విచ్‌ డ్రోన్. దీన్ని ముంబై బేస్డ్‌ స్టార్టప్‌ తయారు చేసింది. ఎత్తైన ప్రాంతాల్లో దీన్ని వాడతారు. మూడోది జెన్ టెక్నాలజీ వ్యూహాత్మక నిఘా కోసం వాడుతారు. వీటితోపాటు కాంబాట్‌ డ్రోన్లు కూడా సైన్యంలోకి రానున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

India Hockey Jersey: హాకీ జట్టు కాషాయ రంగు జెర్సీపై వివాదం! ఆటల్లో రాజకీయమేంటని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్!
హాకీ జట్టు కాషాయ రంగు జెర్సీపై వివాదం! ఆటల్లో రాజకీయమేంటని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్!
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget