Pineapples: ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ పైనాపిల్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసా?
Rahul Gandhi: భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా మేఘాలయలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ అక్కడి పైనాపిల్స్ రుచి చూశారు. తాను ఇప్పటి వరకు రుచి చూడనంత టేస్టీగా ఉన్నాయని పేర్కొన్నాడు.
World Best Pineapples: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి పైనాపిల్స్ ఆయన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అక్కడి పైనాపిల్స్ తాను ఇప్పటి వరకు రుచి చూడనంత టేస్టీగా ఉన్నాయని పేర్కొన్నాడు. జనవరి 23న దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
జోడో యాత్రలో భాగంగా కొన్ని పైనాపిల్స్ రుచి చూశామని రాహుల్ గాంధీ అన్నారు. అక్కడ రోడ్డు పక్కన పైనాపిల్స్ అమ్ముకుంటూ ఒక కూతురు, తల్లి ఉన్నారని, వారు విక్రయిన్న పైనాపిల్స్ రుచి చూశానని, తన జీవితంలో, ఇంత రుచికరమైన పైనాపిల్‌లను ఎప్పుడూ తినలేదన్నారు. మేఘాలయ పైనాపిల్స్ నిజంగా అద్భుతంగా ఉన్నాయని చెప్పిన ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమైన పైనాపిల్ ఇతర దేశాలకు ఎందుకు అందుబాటులో లేదని ప్రశ్నించారు. మిగిలిన రాష్ట్రాలకు ఎందుకు విక్రయించలేక పోతున్నారని? రైతులు ఎందుకు ప్రయోజనం పొందడం లేదని ప్రశ్నించారు.
View this post on Instagram
రాహుల్ గాంధీ చెప్పిన విషయాలతో మేఘాలయ పైనాపిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అత్యంత రుచికరమైన పైనాపిల్స్ రకాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. వాటి పండించే ప్రధాన ప్రదేశాల గురించి తెలుసుకోండి..
- కోస్టా రికా : ప్రపంచంలోనే అతిపెద్ద పైనాపిల్ ఉత్పత్తిదారుగా కోస్టా రికా ప్రసిద్ధి చెందింది. అంతర్జాతీయ మార్కెట్‌లో లభించే పైనాపిల్స్‌లో ఎక్కువ శాతం ఉష్ణ మండల ప్రాంతమైన కోస్టారికా నుంచే వస్తాయి. ఈ పైనాపిల్స్ గొప్ప రుచిని అందిస్తాయి. తియ్యగా, జ్యూసీగా ఉంటాయి. వీటిలో పులుపు తక్కువ ఉంటుంది.
- హవాయి: అత్యంత నాణ్యత కలిగిన పైనాపిల్స్ హవాయిలో పండుతాయి. ప్రఖ్యాత మౌయి గోల్డ్ పైనాపిల్ రుచి అద్భుతంగా ఉంటుంది.
తీపితో పాటు జ్యూసీగా ఉంటుంది. అంతే కాదు స్మూత్ కాయెన్ పైనాపిల్ రకానికి కూడా హవాయి ప్రసిద్ది చెందింది. దీంట్లో చక్కెర, పులుపు సమంగా ఉంటాయి. - ఫిలిప్పీన్స్: ప్రపంచవ్యాప్తంగా పైనాపిల్స్‌ను ఎక్కువగా ఎగుమతి చేసే మరో దేశం ఫిలిప్పీన్స్. ఉష్ణమండల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏడాది పొడవునా పైనాపిల్ పంట దిగుబడి వస్తుంది. ఫార్మోసా అనే రకం పైనాపిల్ ఇక్కత అత్యంత ప్రసిద్ధమైంది. ఇది ఎక్కువ తీయగా, ఆకట్టుకునే ఆకృతిలో ఉంటుంది.
- థాయిలాండ్: మీకు ఎక్కువ తీపి నచ్చకపోతే థాయిలాండ్ రకం ట్రై చేయొచ్చు. ఇతర రకాల పైనాపిల్స్‌తో పోలిస్తే పోలిస్తే థాయిలాండ్ రకం కొంచెం ఎక్కువ పులుపు ఉంటాయి.
- బ్రెజిల్: ప్రపంచవ్యాప్తంగా పైనాపిల్స్‌ను ఉత్పత్తి చేసే మరొక ప్రముఖ దేశం బ్రెజిల్. ఇక్కడ అబాకాక్సీ రకం పైనాపిల్ ఫేమస్. ఇవి తీయగా, జ్యూసీగా తినగానే అద్భుతం అనేలా ఉంటాయి.
- ఆంటిగ్వా: కరేబియన్‌లోని ఆంటిగ్వాన్ బ్లాక్ పైనాపిల్‌ను అరుదైన రకంగా చెబుతారు. వీటిలో పులుపు తక్కువగా ఉంటుంది. అలాగే తీపి ఎక్కువగా ఉంటుంది.
- ప్యూర్టో రికో: ప్యూర్టో రికోలో పినా కొలాడా, రెడ్ స్పానిష్ పైనాపిల్ రకం పండుతాయి. ఈ రకాల్లో తీపి, పులుపు సమపాళ్లలో ఉంటాయి.
- ఇండియా: భారత్‌లోని ఈశాన్య ప్రాంతం, ప్రత్యేకంగా మేఘాలయ, త్రిపుర, అస్సాం రాష్ట్రాలు క్యూ, క్వీన్ పైనాపిల్ రకాలకు ప్రసిద్ధి చెందాయి. అలాగే కేరళలోని వజకులంలో కూడా ఈ రకం పైనాపిల్స్ సాగు చేస్తారు. వీటి రుచి తియ్యగా అద్భుతం అనేలా ఉంటుంది.