Operation Sindhur : ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ ఆర్మీ సంచలన పోస్టు- సైన్యానికి కేంద్రానికి అండగా యావత్ దేశం
Sindhur Operation in POK: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారతదేశం పోక్‌లో దాడి చేసింది. అనంతరం ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. యావత్ దేశం స్పందించింది.

Sindhur Operation in POK: ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. ఏప్రిల్ 7 బుధవారం రాత్రి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో 9 లక్ష్యాలను భారత సాయుధ దళాలు దాడి చేసి ధ్వంసం చేశాయి.
భారత సాయుధ దళాల ఈ చర్యపై, సైన్యం సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. అందులో న్యాయం జరిగింది. జై హింద్! అనిమాత్రమే రాసి ఉంది.
#PahalgamTerrorAttack
— ADG PI - INDIAN ARMY (@adgpi) May 6, 2025
Justice is Served.
Jai Hind! pic.twitter.com/Aruatj6OfA
ఆర్మీ పెట్టిన పోస్టు క్షణాల్లోనే వైరల్
న్యాయం జరిగిందని ఆర్మీ పోట్టిన పోస్టు క్షణాల్లోనే వైరల్ అయింది. అంతా షేర్లు చేశారు. ప్రముఖులు దాన్ని స్టాటస్‌గా పెట్టుకుంటున్నారు. ఆర్మీ చేసిన దాడులకు, కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అండగా ఉంటామంటూ చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కోట్ల మంది తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరికొందరు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ దాడులతో #IndianArmy, #OperationSindoor #IndianArmedForces లాంటి హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
రక్షణ మంత్రిత్వ శాఖ ఏమి చెప్పింది?
రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కాసేపటి క్రితం భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించాయి, దీని కింద పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇక్కడ నుంచి భారతదేశంపై ఉగ్రవాద దాడుకు ప్రణాళికలు రచించారు. అని వెల్లడించింది.
మొత్తం తొమ్మిది (9) ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది. మా చర్య కేంద్రీకృతమై ఉంది, రెచ్చగొట్టేది చర్య కాదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదని తెలిపింది. స్పష్టంగా ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంలో భారతదేశం చాలా సంయమనాన్ని పాటించింది. పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు చనిపోయాడు. అందుకే ఈ చర్యలు తీసుకున్నారు. ఈ దాడి చేసిన వారిని బాధ్యులుగా చేయాలనే మాటకు మేము కట్టుబడి ఉన్నాము. 'ఆపరేషన్ సిందూర్' గురించి వివరణాత్మక సమాచారం బుధవారం ఇస్తామని తెలిపింది.
ఏప్రిల్ 22న ఏం జరిగింది?
ఏప్రిల్ 22న, పహల్గామ్‌లో 5-6 మంది ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని చంపారు. ఎయిర్‌ఫోర్స్, ఓ ఐపీ అధికారి కూడా చనిపోయాడు. ఉగ్రవాదులు వారిని చంపే ముందు మతం గురించి అడిగారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉగ్రవాదులలో ఒకరు ఆ మహిళతో మాట్లాడుతూ నిన్ను చంపను, వెళ్లి మోడీకి చెప్పు అని కూడా అన్నాడు.
ఈ ఉగ్రవాద దాడి తర్వాత ప్రధాని మోడీ తన విదేశీ పర్యటన రద్దు చేసుకుని తిరిగి వచ్చారు. తర్వాత రోజే సింధు జల ఒప్పందాన్ని నిలిపివేశారు. ఇంకా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.





















