అన్వేషించండి

Smart Vision Glasses: AI స్మార్ట్ విజన్ గ్లాసెస్: అంధుల జీవితాల్లో వెలుగులు నింపే అద్భుతం! కొత్త సాంకేతికతతో విప్లవం

Smart Vision Glasses: AI యుగంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. గతంలో అసాధ్యంగా భావించినవి సాధ్యమవుతున్నాయి.  చూపు లేని వారికి గ్లాసెస్‌ రూపొందించారు.

Smart Vision Glasses: సాంకేతికత ద్వారా వైకల్యం ఉన్నవారికి ఎంతో ప్రయోజం కలుగుతోంది. సామాన్యుల మాదిరిగానే వారు కూడా రోజు వారి పనులు చేసుకోవడమే కాకుండా ఆత్మవిశ్వాసంలో విజయాలు సాధిస్తున్నారు. ఇదే మార్గంలో AI ద్వారా మరో ముఖ్యమైన అడుగు పడింది. AIIMS సోమవారం 53 మంది అంధులు ,తీవ్ర దృష్టి లోపం ఉన్నవారికి AI-ఆధారిత స్మార్ట్ విజన్ గ్లాసెస్‌ను పంపిణీ చేసింది. ఈ ప్రత్యేక గ్లాసెస్ చుట్టుపక్కల దృశ్యాలను ధ్వనిగా మారుస్తాయి. అంటే వారు వినడం ద్వారా తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకుంటారు. ఈ పరికరం లెటర్స్  చదవగలదు, వస్తువులను గుర్తించగలదు, ముఖాలను గుర్తించగలదు, దారిలో ఏమైనా ఆటంకాలు వస్తే చెబుతుంది. ధైర్యంగా ముందుడుగు వేయడానికి నావిగేట్ చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో,  దృష్టి లోపం ఉన్నవారికి ఇది ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో తెలుసుకుందాం. 

డైలీ లైఫ్‌ను సులభతరం చేస్తుంది 

రియల్-టైమ్ ఆబ్జెక్ట్ రికగ్నిషన్, టెక్స్ట్-టు-స్పీచ్ టెక్నాలజీతో కూడిన ఈ గ్లాసెస్ రోజువారీ పనులను సులభతరం చేస్తాయి, అవి మెడిసిన్ లేబుల్స్ చదవడం, నోట్స్ గుర్తించడం లేదా వెళ్లే మార్గాన్ని సూచిస్తాయి. అమర్ కాలనీలోని ఒక అంధుల పాఠశాల నుంచి 28 మంది పిల్లలు, AIIMSలోని డాక్టర్ ఆర్‌పి సెంటర్‌తో సంబంధం ఉన్న 25 మందికి వీటిని పంపిణీ చేశారు. వీరిలో లో విజన్, రిహాబిలిటేషన్ క్లినిక్ నుంచి కోలుకోలేని దృష్టి లోపం ఉన్న రోగులు ఉన్నారు.

నిపుణులు ఏమంటున్నారు?

ఈ పరికరానికి సుమారు ₹35,000 ఖర్చవుతుంది, దీనిని 'ప్రాజెక్ట్ విజన్ ' కింద ఉచితంగా అందించారు, ఇది రోటరీ, విజన్ ఎయిడ్, ఇతర భాగస్వాముల మద్దతుతో ఈ పంపిణీ చేపట్టారు.  AIIMSలోని కమ్యూనిటీ ఆప్తాల్మాలజీ విభాగానికి చెందిన డాక్టర్ ప్రవీణ్ వశిష్ట్ ప్రకారం, ఒక నిర్మాణాత్మక పరిశోధన ప్రాజెక్టుగా అమలవుతోంది. లబ్ధిదారుల లైఫ్‌లో వచ్చే మార్పులను గమనించడానికి వారిని ఒక సంవత్సరంపాటు నెలవారీగా సమీక్షిస్తారు. తదుపరి స్టడీ సులభతరం చేయడానికి అధ్యయన ఫలితాలను డాక్యుమెంట్ చేసి ప్రచురిస్తారు. 

భారత్‌లో ఒక పెద్ద సమస్య

భారత్‌లో దాదాపు 10 మిలియన్ల మంది ప్రజలు అంధత్వం లేదా తీవ్రమైన దృష్టి లోపంతో బాధపడుతున్నారు. చాలా కేసులు చికిత్స చేయగలిగినప్పటికీ, కొంతమంది రోగులు అధునాతన గ్లాకోమా, డయాబెటిక్ రెటినోపతి, వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణత లేదా ఆప్టిక్ నరాల దెబ్బతినడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు, దీనికి శస్త్రచికిత్స పరిష్కారం కాదు. అటువంటి సందర్భాల్లో ఈ టెక్నాలజీ వారికి జీవితంలో సరికొత్త వెలుగులు ఇస్తుంది. SHG టెక్నాలజీస్ ద్వారా అభివృద్ధి చేసిన ఈ స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు ఐదో వెర్షన్‌లో ఉన్నాయి. మునుపటి మోడల్స్‌ సాపేక్షంగా పెద్దగా, బటన్-ఆధారితంగా ఉన్నప్పటికీ, కొత్త ఎడిషన్ తేలికైనది, సెన్సార్-ఆధారితమైనది. మరింత అధునాతన AI టెక్నాలజీ అమర్చి ఉంటుంది. అటువంటి AI-ఆధారిత టెక్నాలజీ గ్లాసెస్‌ క్లినికల్ చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని చెబుతున్నారు. దృష్టి లోపం ఉన్న వ్యక్తులు కాస్త ఉపశమనం పొందే వీలుంటుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. 

గమనిక: ఈ సమాచారం పరిశోధన అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయం ఆధారంగా రూపొందించింది. వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవద్దు. ఏదైనా కొత్త కార్యాచరణ లేదా వ్యాయామం చేపట్టే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని లేదా సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget