Viral Video: భారీ వానలోనూ గ్యాస్ సిలిండర్ డెలివరీ, కేంద్రమంత్రిని ఇంప్రెస్ చేసిన ఏజెంట్ - వైరల్ వీడియో
Viral Video: రాజస్థాన్‌లో భారీ వర్షం కురుస్తున్నా ఓ ఏజెంట్ గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
Viral Video:
రాజస్థాన్‌లో భారీ వర్షాలు..
బిపార్‌జాయ్ తుపాను ఎఫెక్ట్‌తో రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా...రాజస్థాన్ మాత్రం వర్షాలతో సతమతం అవుతోంది. అంత భారీ వానలోనూ కొందరు తమ డ్యూటీని మాత్రం మర్చిపోవడం లేదు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను కరెక్ట్ టైమ్‌కి డెలివరీ చేస్తున్నారు. కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఓ ఏజెంట్ వర్షాన్ని, వరదని లెక్క చేయకుండా ఓ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేశాడు. ఈ ఏజెంట్ పనిని ఎంతో మెచ్చుకున్నారు హర్‌దీప్ సింగ్. ఉద్యోగంపై ఇంత డెడికేషన్ ఉండటం గొప్ప విషయం అంటూ కితాబునిచ్చారు. రాజస్థాన్‌లోని బర్మేర్‌లో ధోక్ గ్రామంలో ఈ ఏజెంట్ ఇలా వరదలో కష్టపడుతూనే గ్యాస్ డెలివరీ చేశాడు.
"ప్రతి ఒక్కరికీ ఎల్‌పీజీ అందుబాటులో ఉంటుందని భరోసా ఇస్తున్నాం. డ్యూటీ పట్ల ఎంతో డెడికేషన్ ఉన్న ఈ సైనికుడు బిపార్‌జాయ్ తుపాను ప్రభావాన్నీ లెక్క చేయలేదు. ఇండేన్ గ్యాస్‌ని రీఫిల్‌ని సప్లై చేసేందుకు ఇలా సాహసం చేశాడు"
- హర్‌దీప్ సింగ్ పురి, కేంద్రమంత్రి
चूल्हा जलता रहेगा
— Hardeep Singh Puri (@HardeepSPuri) June 17, 2023
देश बढ़ता रहेगा
Ensuring energy availability.
With commendable dedication towards duty, this undaunted foot soldier of India’s energy sector braves the impact of #Biparjoy to supply an #Indane refill at a consumer’s home in village Dhok in Barmer, Rajasthan. pic.twitter.com/TpOIbN942v
ఇంటి ముందు వరద పారుతున్నా సరే పట్టించుకోకుండా గ్యాస్ బండను మోసుకుంటూ తీసుకొచ్చాడు ఆ ఏజెంట్. ఇప్పటికే ఈ వీడియోకి లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది కామెంట్స్ పెడుతున్నారు.
" ఈ గ్యాస్ డెలివరీ పని చేసే వాళ్లంతా అండర్ రేటెడ్ అని నా అభిప్రాయం. అంత బరువైన సిలిండర్‌ని భుజాన వేసుకుని మెట్లు ఎక్కుతారు. ఎవరి వంటకూ ఇబ్బంది రాకుండా చూస్తారు. వాళ్లకు ఆ శ్రమకు తగ్గ జీతాలు దొరకాలి. డెలివరీకి మంచి వెహికిల్స్‌ని కూడా ఇవ్వాలి"
- ఓ నెటిజన్ కామెంట్
I must say that these delivery people are most underrated and under paid. They lift this weight and climb floors & floors on a daily basis to keep several kitchens working. High time their salaries are reviewed & revised. Also they need better vehicles for efficient delivery
— Timsy Jaipuria (@TimsyJaipuria) June 17, 2023
Fighting against nature has been proved by making seamless delivery of cylinder once again. Kudos for the entire team.
— Rajpal Singh Sidhu (@sidhu0040) June 18, 2023
Regards
Also Read: Green Diamond: జిల్ బైడెన్‌కి మోదీ ఇచ్చిన గ్రీన్ డైమండ్ వెరీ వెరీ స్పెషల్, ఆ బాక్స్కీ ఓ కథ ఉంది