The Kashmir Files Movie: 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రం పూర్తిగా వాస్తవం- ఎందుకీ వివాదం: ఉపరాష్ట్రపతి
'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం వాస్తవికతకు నిదర్శనమన్నారు.
'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై రాజకీయ వివాదం రాజుకున్న మాట వాస్తవమే. కానీ ఈ చిత్రంపై కేంద్రం సహా భాజపా పాలిత ప్రభుత్వాలు, పెద్దలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా మెచ్చుకున్నారు. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ద కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.
Vice President of India Shri Venkiah Naidu speaks on ‘The Kashmir Files’ - “It’s Actual, Factual & Textual” @MVenkaiahNaidu #RightToJustice pic.twitter.com/Bob6dbAMGZ
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 31, 2022
యూఏఈలో
ఈ చిత్రం దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రసారమవుతోంది. యూఏఈలో ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు అనుమతి వచ్చింది. ఏప్రిల్ 7న ఈ చిత్రం అక్కడ థియేటర్లలో విడుదల కానుంది.
250 కోట్లు
వివాదాస్పదమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రాజమౌళీ దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్, అక్షయ్ కుమార్ సినిమా బచ్చన్ పాండే నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ కశ్మీర్ ఫైల్స్ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
మోదీ వ్యాఖ్యలు
'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూాడా కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నాలు జరిగాయని ప్రధాని మోదీ అన్నారు. 'ద కశ్మీర్ ఫైల్స్' లాంటి చిత్రాలు మరిన్ని రావాలని.. వీటి వల్ల ప్రజలకు నిజాలు తెలుస్తాయని మోదీ ఇటీవల అన్నారు.
కశ్మీర్ లోయ నుంచి పండిట్లపై జరిగిన దాడులు, వాళ్లని తరిమికొట్టిన విధానాన్ని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వెండితెరపై చూపించేందుకు ద కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 11న ఈ సినిమా విడుదలైంది. 1990లలో జరిగిన వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది.
Also Read: Rajya Sabha Election 2022: 13 రాజ్యసభ స్థానాల భర్తీకి పోలింగ్- సాయంత్రం 5 గంటలకు లెక్కింపు
Also Read: Sergey Lavrov India Visit: ఉక్రెయిన్ ఉద్రిక్తతల వేళ భారత్‌లో రష్యా విదేశాంగ మంత్రి పర్యటన