అన్వేషించండి

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం, బ్యాటరీ బాక్స్‌లో ఉన్నట్టుండి మంటలు

Vande Bharat Express: భోపాల్ ఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.

Vande Bharat Express: 

భోపాల్ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన..

భోపాల్ ఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బ్యాటరీ బాక్స్‌లో మంటలు రావడం వల్ల ప్రయాణికులు ఆందోళనకు లోనయ్యారు. ఇవాళ ఉదయం (జులై 17) 8 గంటల ప్రాంతంలో మధ్యప్రదేశ్‌లోని కుర్వాయ్ కెతోరా స్టేషన్ వద్ద ఈ ప్రమాదం సంభవించినట్టు అధికారులు వెల్లడించారు. భోపాల్‌లో ఉదయం 5.40 నిముషాలకు ప్రారంభమైంది వందేభారత్ ట్రైన్. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌కి మధ్యాహ్నం 1.10నిముషాలకు చేరుకుంటుంది. అయితే...మధ్యలో అగ్నిప్రమాదం జరగడం వల్ల అంతరాయం కలిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీల్స్ వద్ద పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. ఫైర్ బ్రిగేడ్ వెంటనే అప్రమత్తమై మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. మంటలు కేవలం బ్యాటరీ బాక్స్ వరకే పరిమితం కావడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు. టెక్నికల్ ఎగ్జామినేషన్ పూర్తయ్యేక యథావిధిగా ట్రైన్ బయల్దేరుతుందని తెలిపారు. అంతకు ముందు వందేభారత్‌ ట్రైన్‌కి వరుస ప్రమాదాలు సంభవించాయి. పట్టాల మీదకు ఆవులు రావడం, వాటిని ట్రైన్‌లు ఢీకొట్టిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకూ దాదాపు 68 సార్లు ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. కొందరు ఆకతాయిలు రాళ్లు విసరడం వల్ల పలు ట్రైన్‌లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. తరవాత వాటిని మరమ్మతు చేసి యథావిధిగా సర్వీస్‌లు కొనసాగించారు. 
  
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
EPFO New Facilities: నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
EPFO New Facilities: నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Look Back 2024: IPL వేలంలో సూపర్ హిట్టయిన పంత్, శ్రేయస్- 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఛాన్స్.. బిగ్ ప్లేయర్లకు షాక్ 
IPL వేలంలో సూపర్ హిట్టయిన పంత్, శ్రేయస్- 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఛాన్స్.. బిగ్ ప్లేయర్లకు షాక్ 
Best Gaming Smartphones Under Rs 20000: రూ.20 వేలలోపు బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఇవే - హెవీ గేమ్స్ ఈజీగా ఆడేయచ్చు!
రూ.20 వేలలోపు బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఇవే - హెవీ గేమ్స్ ఈజీగా ఆడేయచ్చు!
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Embed widget