(Source: ECI/ABP News/ABP Majha)
Uttarakhand Tunnel Rescue Operation: కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు స్ట్రెచర్స్, తాడు కట్టి లాగనున్న సిబ్బంది
Uttarakhand Tunnel Rescue: సొరంగం నుంచి స్ట్రెచర్స్ ద్వారా కార్మికులను బయటకు తీసుకురానున్నారు.
Uttarakhand Tunnel Rescue Live Updates:
తుది దశకు రెస్క్యూ ఆపరేషన్..
ఉత్తరాఖండ్ సొరంగంలో (Uttarakhand Tunnel Rescue Operation) చిక్కుకున్న 41 మంది కార్మికులు మరి కొద్ది గంటల్లోనే బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఓ పైప్‌ని అమర్చిన సిబ్బంది మరో పైప్‌ని జతచేసి ఎస్కేప్ రూట్ తయారు చేసేందుకు శ్రమిస్తోంది. ఆ పైప్‌ల ద్వారానే కార్మికులను బయటకు తీసుకురానుంది. అయితే...వాళ్లను ఆ పైప్‌ల నుంచి ఎలా బయటకు తీసుకురావాలో అని ఆలోచించిన అధికారులు ఓ ప్లాన్‌తో ముందుకొచ్చారు. స్ట్రెచర్స్ సాయంతో ఒకరి తరవాత ఒకరిని లోపలి నుంచి బయటకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. మరి కొద్ది మీటర్లు తవ్వితే రెండో పైప్ (Uttarakashi Tunnel Escape Route) అమర్చేందుకు లైన్ క్లియర్ అవుతుంది. ఆ తరవాత వెల్డింగ్ చేసి వెంటనే వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావచ్చు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. నిజానికి ఒకరి తరవాత ఒకరు పాక్కుంటూ బయటకు రావాలని సూచించారు. అయితే..వాళ్ల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్ పక్కన పెట్టేశారు. దాదాపు 12 రోజులుగా శిథిలాల కిందే నలిగిపోయిన వాళ్లకు పాక్కుంటూ బయటకు వచ్చేత ఓపిక ఉంటుందా అన్న ప్రశ్న ఎదురైంది. అందుకే వీల్డ్ స్ట్రెచర్స్ సాయంతో బయటకు తీసుకురావాలని తుది నిర్ణయం తీసుకున్నారు. రెండు పైప్‌లు అమర్చిన తరవాత NDRF సిబ్బంది వీటి ద్వారానే లోపలికి వెళ్తారు. ఆ తరవాత ఒక్కొక్క కార్మికుడిని వీల్డ్ ఛైర్ ద్వారా బయటకు పంపుతారు. ఆ స్ట్రెచర్‌పైనే వాళ్లను పడుకోబెడతారు. పైప్‌లు శరీరానికి కోసుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయట నుంచి NDRF సిబ్బంది ఆ స్ట్రెచర్స్‌కి తాళ్లు కట్టి లాగనున్నారు.
#WATCH | Union minister Gen. VK Singh (Retd) along with a few senior officials enter Uttarkashi's Silkyara tunnel where the operation to rescue trapped workers has intensified pic.twitter.com/jHmaOeJGnc
— ANI (@ANI) November 23, 2023
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి.*T&C Apply