భర్త అనుకుని పొరపాటున వేరే వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చిన మహిళ, యూపీలో వింత ఘటన
Lost Husband: యూపీలో ఓ మహిళ భర్త అనుకుని వేరే వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చింది.
Lost Husband:
బల్లియాలో వింత ఘటన
చాలా ఏళ్ల క్రితం భర్త అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి ఆయన కోసం వెతుకుతూనే ఉంది భార్య. మొత్తానికి జాడ దొరికింది. ఇంటికి తీసుకొచ్చింది. అంతా బాగానే ఉందనుకునే సమయంలో ఈ కథ ఊహకందని మలుపు తిరిగింది. ఆ వచ్చిన వ్యక్తి కనిపించకుండా పోయిన భర్త ఒకటి కాదని తెలిసి మహిళ షాక్ అయింది. ఈ వింత ఘటన యూపీలోని బల్లియాలో జరిగింది. జానకీ దేవి ఈ మధ్యే ఓ దివ్యాంగుడిని ఇంటికి తీసుకొచ్చింది. మిస్ అయిన తన భర్త, ఈ వ్యక్తి ఒకటే అనుకుంది. బల్లియాలోని ఓ జిల్లా ఆసుపత్రి ముందు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తిని చూసి ఇంటికి తీసుకెళ్లింది. గడ్డం, జుట్టు చూసి అచ్చం తన భర్తలాగే ఉన్నాడనుకుంది. చిరిగిపోయిన దుస్తులను చూసి చలించిపోయింది. హాస్పిటల్ బయట చూడగానే "ఇన్ని రోజుకు ఎక్కడికి వెళ్లిపోయావ్..? ఎక్కడున్నావ్.." అని అడిగింది. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేదు. ఇంటికి తీసుకొచ్చి షేవింగ్ చేయించాక కళ్లు తేలేసింది ఆ మహిళ. ఆ తరవాత పుట్టు మచ్చలు చూసి గుర్తు పట్టాలనుకుంది. అవి కూడా కనిపించకపోవడం వల్ల ఈ వ్యక్తి తన భర్త కాదని తెలుసుకుంది. అంతకు ముందు పిల్లలకు చాలా సంతోషంగా "నాన్న వచ్చాడు" అని చెప్పింది. ఓ కొత్త కుర్తా కొనుక్కురమ్మని డబ్బులిచ్చి పంపింది. తీరా చూస్తే...ఆ వ్యక్తి తన భర్త కాదు. తన తప్పు తెలుసుకుని ఆ వ్యక్తికి క్షమాపణలు చెప్పింది. వాళ్లు కుటుంబ సభ్యులకు అప్పగించింది. స్థానికులంతా ఇది చూసి ఆశ్చర్యపోయారు.
Tales like these strengthen my faith in destiny and the power of love.
— Nitesh Singh (@TheNiteshSingh) July 29, 2023
A woman was visiting the hospital for treatment.
A chance encounter turned miraculous when she came face to face with a man in distress, only to discover he was her long-lost husband, missing for 10 years! pic.twitter.com/REduFVTk0n