అన్వేషించండి

VK Singh: ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్న పాక్‌ను ఏకాకి చేయాలి: కేంద్ర మంత్రి వీకే సింగ్

VK Singh: ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్న పాకిస్థాన్ ను ఏకాకి చేయాలని కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు.

VK Singh: ఉగ్ర మూకలను భారత్ పైకి ఎగదోస్తున్న పాకిస్థాన్ ను ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అన్నారు. ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్న పాక్ ఆట కట్టించాలంటే.. భారత్ ఆ దేశంపై ఒత్తిడి పెంచి వారిని ఏకాకిని చేయాలని పేర్కొన్నారు. పాకిస్థాన్ సరైన రీతిలో వ్యవహరించనంత వరకూ భారత దేశంతో సాధారణ సంబంధాలు సాధ్యం కాదని పాక్ దేశానికి తెలిసి రావాలని వీకే సింగ్ అన్నారు. 

జమ్మూ కశ్మీర్ లోని అనంత్‌నాగ్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఆర్మీ అధికారులు వీరమరణం చెందారు. ఆర్మీ కల్నల్ మన్‌ప్రీత్‌ సింగ్, మేజర్ ఆశిష్ ధోన్‌చక్‌, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ హుమాయున్ భట్ లు అమరులయ్యారు. ముగ్గురు జవాన్ల మృతి పట్ల విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

పాకిస్థాన్ ను వేరు చేసి ఒంటరి చేస్తేనే ఏదైనా జరుగుతుందని అన్నారు. ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. కొన్ని సార్లు సినీ రంగానికి చెందిన వ్యక్తులు ముందుకు రావాలని, మరికొన్ని సార్లు క్రికెటర్లు చొరవ చూపాలని సూచించారు. ఏం చేసినా పాక్ ను ఏకాకిని చేయాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

లష్కరే తోయిబాకు చెందిన షాడో గ్రూప్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాజౌరిలోని నార్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో భద్రతా సిబ్బంది ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ ఎన్ కౌంటర్ బుధవారం వరకు కొనసాగింది. అధికారులు, భద్రతా బలగాల పాకిస్థానీ గుర్తులతో ఉన్న మందులను, యుద్ధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు ఇద్దరు ఉగ్రవాదుల కదలికలను గుర్తించారని డిఫెన్స్ పీఆర్వో, లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బర్త్వాల్ తెలిపారు. సెప్టెంబర్ 12వ తేదీన భద్రతా దళాలు ఆ ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. రెండో ఉగ్రవాదిని సెప్టెంబర్ 13వ తేదీన హతమార్చాయి భద్రతా బలగాలు.

పీవోకే దానంతట అదే భారత్‌లో కలుస్తుంది

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ దానంతట అదే త్వరలో భారత్‌లో కలుస్తుంది, కాస్త వేచి ఉండండి అంటూ కేంద్ర మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ రెండ్రోజుల క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని దౌసాలో ప్రెస్‌ కాన్ఫరెన్సన్‌లో పాల్గొన్న మంత్రిని విలేకరులు ఈ అంశంపై ప్రశ్నించగా ఆయన వై విధంగా సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. బీజేపీ చేపడుతున్న పరివర్తన్‌ సంకల్ప్‌ యాత్రలో భాగంగా వీకే సింగ్‌ దౌసాలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అయితే పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలోని వారు భారత్‌లో కలిసిపోయేందుకు డిమాండ్‌ చేస్తున్నారు దీనిపై స్పందించమని అడగగా ' పీఓకే త్వరలోనే భారత్‌లో దానంతట అదే కలిసిపోతుంది. కాస్త సమయం వేచి ఉండండి' రిటైర్డ్‌ ఆర్మీ చీఫ్ జనరల్‌ వీకే సింగ్‌ బదులిచ్చారు. ఇటీవల చైనా భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను, ఆక్సాయ్‌చిన్‌ను తమ భూభాగంగా చూపిస్తూ మ్యాప్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే వీకే సింగ్‌ ఈ విధంగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget