సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు సరైన బదులు చెప్పండి, మంత్రులకు ప్రధాని మోదీ ఉపదేశం!
Sanatana Dharma Row: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు గట్టి బదులివ్వాలని మంత్రులకే ప్రధాని సూచించినట్టు సమాచారం.
Sanatana Dharma Row:
మంత్రులతో ప్రత్యేక సమావేశం..
సనాతన ధర్మంపై తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. దాదాపు మూడు రోజులుగా ఈ కామెంట్స్‌పై కౌంటర్‌లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా...బీజేపీ దీన్ని చాలా గట్టిగా ఖండిస్తోంది. హైకమాండ్ కూడా ఈ కామెంట్స్‌పై సీరియస్ అయింది. కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఇప్పటికే స్పందించారు. అయితే...ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించినట్టు తెలుస్తోంది. మంత్రులతో సమావేశమైన సమయంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతే కాదు. సనాతన ధర్మంపై చేసిన ఈ వ్యాఖ్యలకు గట్టి బదులు చెప్పాల్సిందేనని మోదీ చెప్పినట్టు తెలుస్తోంది. అదే సమయంలో మరీ అతిగా మాట్లాడడమూ సరికాదని సూచించినట్టు సమాచారం.
"చరిత్ర గురించి చర్చించకండి. మరీ లోతుగా వెళ్లకండి. కానీ...నిజం ఏంటో అదే మాట్లాడండి. రాజ్యాంగబద్ధంగానే వ్యాఖ్యలు చేయండి. అదే సమయంలో కేవలం ప్రస్తుత అంశాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే మాట్లాడడం మంచిది"
- మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ
ఇదే సమావేశంలో "Bharat" అంశంపైనా చర్చించినట్టు సమాచారం. కేవలం అధికారిక వ్యక్తులు మాత్రమే ఈ అంశంపై మాట్లాడాలని, ఇంకెవరూ నోరు మెదపొద్దని ప్రధాని ఆదేశించారట.
ఉదయనిధి స్టాలిన్ మరోసారి..
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై (Sanatan Dharma) చేసిన వ్యాఖ్యలు దుమారం ఇంకా సద్దుమణగక ముందే..మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పిలవలేదన్న ఆయన...సనాతన ధర్మానికి ఇదే నిదర్శనమని అన్నారు.
"కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించలేదు. సనాతన ధర్మం అంటే ఏంటో ఇంతకు మించి మంచి ఉదాహరణ ఇంకేముంటుంది..?"
- ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు మంత్రి
ఇక్కడితో ఆగకుండా హిందీ భాష గురించీ సెటైరికల్ ట్వీట్ చేశారు ఉదయనిధి స్టాలిన్. "హిందీ తెలియదు వెళ్లండి" అంటూ ఓ లాఫింగ్ ఎమోజీతో ట్వీట్ చేశారు. సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు స్పందించడంపై ఈ సెటైర్లు వేశారు ఉదయనిధి. వాళ్లు హిందీలో మాట్లాడడంపై ఇలా స్పందించారు.
Hindi theriyathu Poda 😂
— Udhay (@Udhaystalin) September 5, 2023
కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బౌద్ధం, జైనం ఎప్పుడు మొదలయ్యాయో అందరికీ తెలుసని, మరి సనాతనధర్మం ఎప్పుడు మొదలైందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రపంచ చరిత్రలో ఎన్నో మతాలు పుట్టుకొచ్చాయన్న పరమేశ్వర...హిందూ ధర్మం ఎప్పుడు పుట్టిందో చెప్పాలని అన్నారు.
"ప్రపంచ చరిత్రలో ఎన్నో మతాలు పుట్టుకొచ్చాయి. జైనిజం, బుద్ధిజం అలా మొదలైనవే. మరి హిందూ మతం సంగతేంటి..? అది ఎప్పుడు పుట్టింది..? ఎవరు మొట్టమొదట ఈ ధర్మాన్ని ఆచరించారు..? ఇప్పటికీ ఇదో ప్రశ్నే. బుద్ధిజం, జైనిజం మతాలకు ఓ చరిత్ర ఉంది. ఇస్లాం, క్రిస్టియానిటీ వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చాయి. ఏదేమైనా అన్ని మతాలు చెప్పేది ఒక్కటే. మానవత్వం అవసరం అని"
- జి పరమేశ్వర, కర్ణాటక హోం మంత్రి
Also Read: మోదీ అంటే ఏంటో ప్రజలకు అర్థమైంది, మూడోసారీ నన్నే ఎన్నుకుంటారు - ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు