Delhi Car Blast:"లేడీ ఉగ్రవాద డాక్టర్‌ది వింత ప్రవర్తన" షాహిన్ షాహిద్ గురించి భయపడతూ చెబుతున్న సహచరులు!
AL Falah University:ఆమెకు నచ్చినప్పుడు వచ్చేది చెప్పకుండానే వెళ్లిపోయేది షాహిన్ షాహిద్ గురించి చెబుతూ వణికిపోతున్న సహచరులు. భారత్‌లో జేఈఎం మహిళా చీఫ్‌గా అధికారులు అనుమానపడుతున్నారు.

AL Falah University:ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు కేసు దర్యాప్తు జరుపుతున్న అధికారులకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. దేశంలో అలజడి రేపేందుకు దేశ సరిహద్దుల్లో కాచుకొని కూర్చొని ఉన్న ఉగ్రమూకలు వేస్తున్న పన్నాగాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. దీనికి దేశంలో వైట్ కోటు వేసుకొన్న వ్యక్తులు వారికి సహకరిస్తున్న సంగతి ఇప్పటికే ప్రపంచానికి తెలియవచ్చింది. ఆపరేషన్ సిందూర్‌తో దెబ్బతిన్నప్పటికీ బుద్ది తెచ్చుకోని ఉగ్రమూకలు పదేపదే ఇండియాను టార్గెట్ చేస్తున్నాయి. ఏదో రూపంలో హాని తలపెట్టాలని చూస్తున్నాయి.
ఉగ్రవాద మాడ్యూల్‌లో నలుగురు వైద్యులు కీలక వ్యక్తులు అని దర్యాప్తులో తేలింది. ఇందులో కాశ్మీర్‌కు చెందిన ముగ్గురు వైద్యుల పాత్రపై దర్యాప్తు సాగుతోంది. మరోవైద్యురాలు లక్నోకు చెందిన షాహీన్. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న జైష్ ఎ మొహమ్మద్ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు షాహిన్ తెలుస్తోంది. ఆమె గురించి చెబుతూ అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలోని సిబ్బంది వణిగిపోతున్నారు. నిజంగా అలాంటి వ్యక్తి అనుకోలేదని ఆమె మాట తీరు, ప్రవర్తన చాలా వింతగా ఉండేదని అంటున్నారు.
వైద్యురాలిగా ఉంటున్న షాహిన్ గురించి ఎవరికీ పెద్ద తెలియదని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలోని పని చేస్తున్న వైద్యులు, ప్రొఫెసర్స్, సిబ్బంది చెబుతున్నారు. తన పని తాను చేసుకొని వెళ్లిపోయేదని, అయితే ఆమెను కలవడానికి చాలా మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేవారని వివరిస్తున్నారు. లక్నోలో ఉంటున్న ఆమె ఫరీదాబాద్‌లో భారీ పేలుడుకు కుట్ర చేశారని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆమె గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
షాహిన్ ప్రవర్తన తరచూ విచిత్రంగా ఉండేదని చెబుతున్నారు. ఎప్పుడు విధులకు వస్తుందో, లేదో ఎవరికీ తెలిసేది కాదని, కొన్ని సార్లు సడెన్‌గా వెళ్లిపోయేదని ఎక్కడికి వెళ్లుందో ఎవరికి చెప్పేది కాదని అంటున్నారు. వీటి గురించి ఎవరికి సమాచారం ఇచ్చేది కాదని పూర్తిగా క్రమశిక్షణారాహిత్యంగా ఉండేదన్నారు. ఆమె కారణంగా విధుల్లో ఇబ్బంది పడ్డ చాలా మంది యాజమాన్యానికి ఫిర్యాదు చేశారని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోంది. అధికారులకు పూర్తిగా సహకరిస్తామని వారి అడిగిన వివరాలు చెప్పినట్టు సిబ్బంది వెల్లడించారు.
సిబ్బంది, సహచరులు చెప్పిన వివరాలు ఆధారంగా అధికారులు విచారణ చేస్తున్నారు. అసలు ఈ షాహిన్ ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో ఆరా తీస్తున్నారు. పాకిస్తాన్‌లో జేఈఎం వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోది సాదియా అజార్ నేతృత్వంలో ఉన్న విభాగానికి చెందిన భారత్ శాను ఈమెకు అప్పగించారని దర్యాప్తులో తేలింది. అదే యూనివర్శిటీలో పని చేస్తున్న డాక్టర్ ముజమ్మీల్ గనాయ్ అలియాస్ ముసైబ్‌తో షాహిన్‌కు సంబంధాలు ఉన్నట్టు తేల్చారు. అతను ఉంటున్న గదుల నుంచి దాదాపు మూడువేల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అస్సాల్ట్ రైఫిల్, పిస్టల్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న కారు కూడా షాహిన్ పేరు మీద ఉన్నట్టు విచారణలో స్పష్టమైంది.





















