Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేల క్రిమినల్ కేసుల విచారణపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Supreme Court: తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని(క్రిమినల్ కేసులకు సంబంధించి) కోరుతూ వేసిన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
Supreme Court: తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని (క్రిమినల్ కేసులకు సంబంధించి) కోరుతూ వేసిన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను హైకోర్టు(High Courts)లకు అప్పగించింది. దేశంలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైన సంగతి తెలిసిందే.
న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ (Ashwini Upadhyay) ఈ పిల్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించే విషయంలో, ఏకరీతి మార్గదర్శకాలను రూపొందించడం కష్టమని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. ఇదే సమయంలో అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది. ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసులను వేగంగా విచారించాలని అన్ని రాష్ట్రాల హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
High Courts should form special bench to monitor cases against MPs/ MLAs; cases punishable by death should be prioritised: Supreme Court
— Bar & Bench (@barandbench) November 9, 2023
report by @DebayonRoy https://t.co/IIU9fPl61h
ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది. ఇందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహించాలని పేర్కొంది. కేసులు త్వరగా పరిష్కరించడాన్ని, పర్యవేక్షించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా ప్రత్యేక టైటిల్ ఏర్పాటు చేయాలని సూచించింది. దాఖలు చేసిన సంవత్సరం, పెండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్ కేసుల సంఖ్య, విచారణల దశ గురించి జిల్లా వారీగా సమాచారాన్ని అందించే వెబ్‌సైట్‌ను రూపొందించాలని చెప్పింది.
కేసులను త్వరితగతిన, ప్రభావవంతంగా పరిష్కరించేందుకు అవసరమైన ఆదేశాలు హైకోర్టు జారీ చేయవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. అలాగే కేసుల వివరాలు, విచారణ అంశాల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ రూపొందించాలని ఆదేశించింది. తీవ్రమైన నేరం కేసులో దోషిగా తేలిన ఎంపీ/ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.
గతంలోను ఇదే తరహా వ్యాఖ్యలు
ప్రజాప్రతినిధులు తీవ్రమైన నేరం కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. గత జులైలో విచారణ సందర్భంగా తీవ్రమైన నేరం కేసులో దోషులుగా తేలిన చట్టసభ సభ్యులను జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టులు నిషేధించలేవని సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో దాఖలైన పిటిషన్లను విచారించడానికి అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. చట్టసభలు ఆరేళ్లు అని చెప్పినప్పుడు జీవితకాల నిషేధాన్ని ఎలా చెప్పగలమంటూ? పిటిషనర్‌తో పాటు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్‌ను కూడా ధర్మాసనం ప్రశ్నించింది.
ఆరేళ్లు సరికాదు
ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరించిన విజయ్ హన్సారియా పిటిషనర్ వాదనతో అంగీకరించారు. నేరం రుజువు అయితే సాధారణ ప్రభుత్వ ఉద్యోగులను కూడా సర్వీసుల నుంచి శాశ్వతంగా తొలగిస్తారని, కానీ రాజకీయ నాయకుల విషయంలో మాత్రం అలా జరగడం లేదని కోర్టుకు వివరించారు. ఆరేళ్ల పాటు నిషేధంతో సరిపెట్టేయటం సరికాదన్నారు.