Railway Property Act: ట్రైన్‌లో ఆ పని చేస్తే నేరుగా జైలుకే! రైల్వే చట్టం ఏంటో తెలుసుకోండి
Railway Property Act: భారతీయ రైల్వే ప్రయాణీకులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుంది, కానీ చాలామంది వాటిని దుర్వినియోగం చేస్తుంటారు. ఇది ఎంత పెద్ద నేరమో తెలుసుకోండి.

Railway Property Act:రైల్వేలో మీరు ఏ కేటగిరీ టిక్కెట్ బుక్ చేస్తే, అదే ప్రకారం రైల్వే మీకు సౌకర్యాలు అందిస్తుంది. ఉదాహరణకు, మీరు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకుంటే, మీరు జనరల్ కేటగిరీ టిక్కెట్‌తో ప్రయాణించవచ్చు. ఈ కోచ్‌లో ప్రయాణికులకు కూర్చోవడానికి రైల్వే స్థలం అందిస్తుంది. మీరు కాస్త ఎక్కువ ఖర్చు చేస్తే, మీరు స్లీపర్ క్లాస్ సేవలను పొందవచ్చు, ఇందులో రైల్వే మీకు చాలా వసతులు కల్పిస్తుంది.
మీరు మరింత ఖర్చు చేస్తే, మీరు థర్డ్ క్లాస్ ఏసిలో ప్రయాణించవచ్చు. ఈ క్లాస్‌లో మీకు పడుకోవడానికి అలాగే ఏసీ సౌకర్యం లభిస్తుంది. ఇందులో మీకు దుప్పటి, బెడ్‌షీట్, దిండు లభిస్తాయి. తద్వారా మీరు మీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసుకోవచ్చు. అయితే, రైల్వే ఈ సౌకర్యాన్ని చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. దుప్పట్లు, దిండ్లు లేదా బెడ్‌షీట్లను దొంగిలించి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇది ఎంత పెద్ద నేరమో తెలుసా? మీకు ఎంత శిక్ష పడవచ్చో తెలిస్తే మాత్రం ఇకపై ఆ పని చేయరు.
ఎన్ని దుప్పట్లు, బెడ్‌షీట్లు, దిండ్లు పోతున్నాయంటే?
2018లో భారతీయ రైల్వేలో దుప్పట్లు, బెడ్‌షీట్లు, దిండ్ల దొంగతనం గురించి ఒక నివేదిక వచ్చింది, ఇందులో రైల్వే బోగీల నుంచి 2 లక్షల దిండ్లు, 81 వేల బెడ్‌షీట్లు, 7 వేల దుప్పట్లు ఎత్తుకెళ్లిపోతున్నారు. రైల్వే ఈ రకమైన దొంగతనాలను నిరోధించడానికి జరిమానా, శిక్ష రెండింటినీ అమలు చేసింది. రైల్వే ఆస్తి చట్టం 1996 ప్రకారం, మీరు మొదటిసారి ఈ రకమైన దొంగతనం చేస్తున్నట్లు పట్టుబడితే, మీకు 1 సంవత్సరం జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా విధించవచ్చు, కానీ మీరు ఈ రకమైన చర్యలను పదే పదే చేస్తే, మీకు 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధిస్తారు.
రైల్వేకు లక్షల్లో నష్టం
ప్రతి సంవత్సరం దుప్పట్లు, బెడ్‌షీట్లు, దిండ్ల దొంగతనం వల్ల రైల్వేకు లక్షల్లో రూపాయల నష్టం జరుగుతోంది. 2017-18లో జరిగిన లక్షలాది దుప్పట్లు, బెడ్‌షీట్లు, దిండ్ల దొంగతనం వల్ల రైల్వేకు కోట్లలో నష్టం జరిగింది.





















