(Source: ECI/ABP News/ABP Majha)
Southern Travels: పర్యాటకుల కోసం సదరన్ ట్రావెల్స్ హాలిడే మార్ట్ మెగా ఆఫర్
Southern Travels: జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల కోసం సదరన్ ట్రావెల్స్ హాలిడే మార్ట్ మెగా ఆఫర్లను అందిస్తోంది.
Southern Travels: భారతదేశపు అగ్రశ్రేణి పర్యాటక, ఆతిథ్య రంగ సంస్థలలో ఒకటైన సదరన్ వెల్స్.. అతి పెద్ద ఫ్లాష్ సేల్ ' హాలిడే మార్ట్ 'తో మరోసారి కస్టమర్ల ముందుకు వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కోల్ కత్తా, ఛతీస్ గఢ్ లలో శనివారం హాలీడే మార్టులను ప్రారంభించింది. హైదరాబాద్ లో హాలీడే మార్ట్ ను.. సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ప్రారంభించారు. దేశంలోని వివిధ నగరాలలో ఈ నెల 23వ తేదీ నుంచి సదరన్ ట్రావెల్స్ గ్రాండ్ హాలిడే రోడ్ షోలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ హాలిడే మార్ట్ లో దేశంలోనే అత్యంత ప్రాధాన్యత గల ప్రయాణ భాగస్వామి సదరన్ ట్రావెల్స్.. దేశీయ, అంతర్జాతీయ టూర్లపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తోంది. భారీ డిస్కౌంట్లతో పర్యాటకులను ఆశ్చర్యపరచనున్నట్లు సమాచారం. టూర్ బుకింగ్ లపై సిల్వర్ కాయిన్ గెలుచుకొనే అవకాశం, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, అంతర్జాతీయ హాలిడే టూర్ల బుకింగ్స్ పై దేశీయ హాలిడే టూర్లను ఉచితంగా అందించడంతోపాటు లక్కీ డ్రాలపై ఎన్నో బహుమతులను కూడా అందిస్తోంది.
దేశంలోని వివిధ నగరాల‌్లో జరుపనున్న ఈ హాలిడే మార్ట్ ను ఈ సంవత్సరం తొలిసారిగా టెక్నాలజీ ఆధారంగా నిర్వహిస్తోందీ సదరన్ ట్రావెల్స్. హాలిడే మార్ట్ ప్రదేశానికి వెళ్లలేని ఔత్సాహిక ప్రయాణికులు ఆన్ లైన్ లో తమ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. తమను గైడ్ చేసే ట్రావెల్ ఎక్స్పర్ట్ లను సంప్రదించవచ్చు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. ఈ ఫ్లాష్ సేల్ సమయంలో ప్రయాణంపై ఆసక్తి ఉన్న ఔత్సాహిక ప్రయాణికులు తమకు ఇష్టమైన టూర్ ప్యాకేజీని ఎంచుకుని, ఆ ప్యాకేజీ మొత్తం ధరను కాకుండా డిస్కౌంట్ పోను వచ్చిన దాన్నే చెల్లించాలని సూచించారు. టోకెన్ మొత్తం ధర కేవలం రూ. 5000 అనీ, ఇదే బుకింగ్ మొత్తంగా పరిగణిస్తారని వివరించారు. ఈ నిర్ణీత వ్యవధిలో నిర్వహించే హాలీడే మార్ట్‌లో ఆఫర్ చేసిన ధరనే కస్టమర్లు చెల్లించాల్సి ఉంటుందని, టోకెన్ అమౌంట్ ఈ ఏడాది డిసెంబర్ వరకు బుక్ చేసుకునే ఏ టూర్లకైనా సర్దుబాటు చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం సదరన్ ట్రావెల్స్.. దేశీయ, అంతర్జాతీయ గమ్య స్థానాలకు 440కి పైగా కస్టమైజ్డ్, గ్రూప్ ప్యాకేజీలను ప్రవేశపెట్టిందని తెలిపారు.
కస్టమర్లు యూరోప్, ఆఫ్రికా, స్కాండినేవియా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆసియా, మధ్య తూర్పు, దుబాయ్, యూఎస్ఏ, కెనడా వంటి విదేశీ టూర్ ప్యాకేజీలతోపాటు భారత దేశంలోని నార్త్ ఇండియా నుంచి సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇండియాల‌్లో ఎక్కడికైనా టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకోవచ్చు అని ఆయన వివరించారు. ఈ హాలిడే మార్ట్‌లో దేశంలోని రాజస్థాన్, కేరళ, అండమాన్, చార్ ధామ్, హిమాచల్, కాశ్మీర్, నార్త్ ఈస్ట్, తమిళనాడు, గుజరాత్ వంటి ప్రధాన పర్యాటక స్థానాలన్నీ కవర్ చేయనున్నారు. కస్టమర్లకు వారి బడ్జెట్ లోనే ప్రయాణం, కుటుంబంతో కలిసి ప్రయాణం, హనీమూన్, వెల్ నెస్, సాహసోపేత టూర్లు, గ్రూప్ ప్రయాణాలు వంటి సౌలభ్యతలను మెగా హాలీడే మార్ట్ కస్టమర్లకు అందిస్తుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
సదరన్ ట్రావెల్స్ ఖ్యాతి..
1970 వ సంవత్సరంలో తొలిసారిగా న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన సదరన్ ట్రావెల్స్.. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొంది దేశమంతటా తన బ్రాంచ్ లను విస్తరించింది. పర్యాటక, ఆతిథ్య రంగంలో 5 దశాబ్దాల నుంచి వ్యక్తిగత సెలవుల టూర్లు, నిర్దిష్ట స్థిర ప్రయాణాలు, ప్రోత్సాహక సెలవుల టూర్లు, ప్రత్యేక ఆసక్తితో కూడిన టూర్లు, వీసాలు, హోటల్ బుకింగ్స్ అందజేస్తోంది. కార్పొరేట్, విరామ సమయ ప్రయాణాలలోనూ తనదైన ముద్ర వేసింది. ప్రయాణ, పర్యాటక రంగాల‌్లో అపారమైన అనుభవాన్ని, లోతైన పరిజ్ఞానాన్ని కలిగి వుంది. ఈ కారణంగా కస్టమర్ల అవసరాలను బట్టి టూర్లను డిజైన్ చేసి అందిస్తోంది. న్యూ ఢిల్లీ, జైపూర్, విజయవాడ నగరాల‌్లో సదరన్ ట్రావెల్స్ సంస్థ 200కుపైగా రూమ్స్ తో కూడిన హోటళ్లు కలిగి ఉంది. వారణాసిలోని కాశీ దేవాలయ ఆవరణలోని ప్రతిష్టాత్మకమైన " భీమశంకర్ గెస్ట్ హౌస్ " నిర్వహణకు అవార్డు సొంతం చేసుకుంది. ఈ గెస్ట్ హౌస్ ను ఇటీవలే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.