By: Ram Manohar | Updated at : 13 Sep 2023 05:50 PM (IST)
బిహార్‌లో మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి పడడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
Mid Day Meals:
మిడ్ డే మీల్స్‌లో ఊసరవెల్లి..
బిహార్‌లోని సీతమర్హి జిల్లాలోని ఓ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపు నొప్పితో ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతానికి విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని, అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు వెల్లడించారు. అసలు వీళ్లు అస్వస్థకు గురవ్వడానికి కారణమేంటని ఆరా తీస్తే...మధ్యాహ్న భోజనంలో ఓ ఊసరవెల్లి పడిందని తేలింది. అందరూ తిన్న తిరవాత ఉన్నట్టుండి అందులో ఊసరవెల్లి కనిపించిందని, అప్పటికే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని స్కూల్ యాజమాన్యం తెలిపింది. గత నెల కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఢిల్లీలోని దబ్రీ ప్రాంతంలోని ఓ స్కూల్‌లో మిడ్ డే మీల్స్ తిన్న తరవాత 70 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. మిడ్ డే మీల్స్ అందిస్తున్న కాంట్రాక్టర్‌కి షో కాజ్ నోటీసులు జారీ చేసింది. క్రైమ్ టీమ్‌ని రంగంలోకి దింపి విచారణ చేపట్టింది. అంతకు ముందు కూడా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు కొందరు కాంట్రాక్టర్‌లు. నాసిరకమైన బియ్యంతో అన్నం వండి పంపుతున్నారు. వండే చోట పరిశుభ్రంగా ఉండడం లేదు. అందులో బల్లులు, పురుగులు పడడం...వాటినే పిల్లలకు అందించడం సర్వసాధారణమైపోయింది.
#WATCH | Bihar | Around 50 school children complained of stomach ache and vomiting allegedly after consuming mid-day meal at a primary school in Dumra Block of Sitamarhi district on 12th September. The children were referred to Sadar Hospital. Doctor says that all the children… pic.twitter.com/woCXGS9LP4
— ANI (@ANI) September 13, 2023
Also Read: అనుమానాస్పద బ్యాగ్‌లతో చైనా ప్రతినిధులు, G20 సమ్మిట్‌కి ముందు కలకలం
I.N.D.I.A కూటమికే మా ఫుల్ సపోర్ట్, సీట్ షేరింగ్‌పైనా త్వరలోనే క్లారిటీ - కేజ్రీవాల్
2024లో జమిలి ఎన్నికలు లేనట్టే! నిర్వహణ కష్టమని చెప్పిన లా కమిషన్?
Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట - ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు
తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం
CISF Fireman Answer Key: సీఐఎస్‌ఎఫ్ కానిసేబుల్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం
TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్ చూశారా?
YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి, కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్
/body>